హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెట్‌టాప్ బాక్సుల తయారీలో ఉన్న ఎక్స్‌జా ఇన్ఫోసిస్టమ్స్ డిజిటల్ ప్రకటనలకై కొత్త వేదికను అభివృద్ధి చేసింది. ‘అడ్వాంటేజ్’ పేరుతో తొలుత కేబుల్ టీవీ ద్వారా వీక్షకులకు చేరువ కానుంది. టీవీ రిమోట్‌ను ఆపరేట్ చేస్తున్న సమయంలో మాత్రమే చిన్న సైజులో ప్రకటనలు తెరపై ప్రత్యక్షమవుతాయి. వీక్షకులు అవసరమైతే ఆ ప్రకటనను రిమోట్‌లో ప్రత్యేక బటన్‌ను నొక్కడం ద్వారా స్క్రీన్ మీద పెద్దగా చూసుకోవచ్చు. అడ్వాంటేజ్ ద్వారా కేబుల్ ఆపరేటర్లకు అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్స్‌జా ఎండీ జాయ్ కొక్కట్ తెలిపారు. డైరెక్టర్లు సోన్యా రాయ్, విశాల్ మల్హోత్రా, అద్నాన్ ధులియావాలాతో కలిసి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
అతి తక్కువ ఖర్చుతో: అడ్వాంటేజ్ సేవలను మొదట తెలంగాణలో ప్రారంభిస్తున్నట్టు జాయ్ కొక్కట్ చెప్పారు. ‘కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ప్రకటనలు నియంత్రిస్తాం. ట్రాయ్ పరిమితులకు లోబడే ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేశాం. వీక్షకులున్న ప్రాంతం, భాష ఆధారంగా ప్రకటనలు మార్చవచ్చు. ఇతర ప్రకటనలతో పోలిస్తే 1/8 వంతు మాత్రమే ప్రకటనదారుల నుంచి చార్జీ వసూలు చేస్తాం. వీడియో యా డ్స్‌కు సైతం టెక్నాలజీ రూపొందించాం. భారత్‌లో 14 మంది, విదేశాల్లో ఇద్దరు కేబుల్ ఆపరేటర్లు మా కస్టమర్లు’ అని తెలిపారు. దేశవ్యాప్తంగా 35 లక్షల గృ హాల్లో ఎక్స్‌జా సెట్‌టాప్ బాక్సులు వాడుతున్నారు.
డిజిటల్ యాడ్స్‌లో ‘అడ్వాంటేజ్’
Published Fri, Jul 6 2018 1:24 AM | Last Updated on Fri, Jul 6 2018 1:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment