Ajay Devgan Birthday: Top 5 Unknown Facts Ajay Devgn On His Birthday - Sakshi
Sakshi News home page

Ajay Devgn: అజయ్‌ దేవగణ్‌ గురించి తెలియని 5 రహస్యాలు..

Published Sat, Apr 2 2022 1:22 PM | Last Updated on Sat, Apr 2 2022 2:16 PM

Top 5 Unknown Facts Ajay Devgn On His Birthday - Sakshi

Unknown Facts About Ajay Devgn: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ఇటీవల విడుదలైన దర్శక ధీరుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్, రకుల్‌ ప్రీత్ సింగ్‌తో కలిసి రన్‌వే 34 సినిమాలో అలరించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే అజయ్‌ దేవగణ్‌ మరో సంవత్సరం పెద్దవాడయ్యాడు. 1969, ఏప్రిల్‌ 2న జన్మించిన అజయ్‌ దేవగణ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బాలీవుడ్‌ సినీ తారలు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. అయితే 53వ పడిలోకి అడుగు పెడుతున్న ఈ బాలీవుడ్‌ హీరో 5 రహస్యాలు ఏంటో తెలుసుకుందామా !

1. ట్రావెలర్‌
అజయ్ దేవగణ్‌ మంచి నటుడే కాకుండా ట్రావెల్‌ లవర్‌ కూడా. అతని కుటుంబంతో ప్రయాణించడం కంటే ఆయనకు ఏది గొప్ప ఆనందాన్ని ఇవ్వదట. అజయ్‌ తన తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, ఇద్దరు సోదరీమణులు, వారి భర్తలు, పిల్లలతో కలిసి దూర ప్రయాణాలు చేస్తుంటాడని సమాచారం. సెలవుల్లో 25 మంది కుటుంబ సభ్యుల బృందం కలిసి టూర్‌కు వెళ్తాడట. ఇందుకోసం బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించి స్టే చేసేందుకు సాధ్యమైతే ఏకంగా ఒక ఐలాండ్‌నే బుక్‌ చేస్తాడని సమాచారం. 

2. శివ భక్తుడు
అజయ్‌ దేవగణ్‌ గొప్ప శివ భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అతని ఛాతిపై శివుడి పచ్చబొట్టు కూడా వేయించుకున్నాడు. అంతేకాకుండా ఆయన డైరెక్ట్‌ చేసిన 'శివాయ్‌' మూవీని శివుడికి అంకితం ఇచ్చాడు.  

3. టాలెంటెడ్‌ కుక్‌
అద్భుతంగా వండటంలోనూ అజయ్‌ దేవగణ్‌ సిద్ధహస్తుడు. భారతీయ, కాంటినెంటల్‌ డిషెస్‌ను సూపర్‌గా చేయగలడని టాక్. 

4. కుటుంబమంటే అమితమైన ప్రేమ
యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టే అజయ్‌ దేవగణ్‌ మంచి ఫ్యామిలీ మ్యాన్ కూడా. ఆయనకు మొదటగా పుట్టిన కూతురు నైసా.. అజయ్‌ దేవగణ్‌ బలహీనత. కనీసం రోజులో కొన్నిసార్లు అయినా ఆమెతో మాట్లాడలేకపోతే అజయ్‌కు రోజు గడవదట. అలాగే కుమారుడు యుగ్ అన్న అజయ్‌కి అమితమైన ప్రేమ. 

5. పోలో గ్రీన్ కొలోన్‌ అంటే ఇష్టం 
అజయ్ దేవగణ్‌ గత మూడు దశాబ్దాలుగా రాల్ఫ్ లారెన్ తయారు చేసిన పోలో గ్రీన్ అనే కొలోన్‌నే ధరిస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement