
బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవ్‌గన్, అద్భుతమైన నటన పనితీరును కనబరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన నటనకు వంకలు కూడా పెట్టక్కర్లేదు. కానీ అజయ్ నటనను కూడా విమర్శించే వారు ఒకరున్నారట. ఎవరో తెలుసా? ఆమెనే నైసా. తన కూతురు నైసానే తనకు పెద్ద విమర్శకురాలంటూ డీఎన్‌ఏ ఇంటర్వ్యూలో అజయ్ తెలిపారు. ఇదే సమయంలో భార్య కాజోల్‌పై ఛలోక్తులు కూడా విసిరారు. తన సినిమాలను విమర్శించేంత గట్స్ కాజోల్‌కు లేవంటూ చెప్పుకొచ్చారు.
''కాజోల్‌కు నా సినిమాలను విమర్శించేంత గట్స్ లేవు. కానీ నా కూతురు నైసాకు ఉన్నాయి. నైసానే నాకు పెద్ద విమర్శకురాలు. నైసా నన్ను అసలు విడిచిపెట్టదు'' అంటూ అజయ్ కూతురు నైసా గురించి ముచ్చటించారు. ప్రస్తుతం నైసా సింగపూర్‌లోని ఆగ్నేయాసియాలో యూనిటెడ్ కాలేజీలో చదువుకుంటోంది. అజయ్ దేవ్‌గన్ కూడా ప్రస్తుతం రాజ్‌కుమార్ గుప్తా రైడ్‌లో నటించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 16న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో ఇలియానా డి క్రజ్ కూడా ముఖ్య పాత్రలో నటించింది.