కూతురికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన స్టార్‌ కపుల్‌ | Kajol and Ajay Devgn Bought a Costly Apartment For Daughter | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 12:07 PM | Last Updated on Thu, Nov 1 2018 4:30 PM

Kajol and Ajay Devgn Bought a Costly Apartment For Daughter - Sakshi

బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ అజయ్‌ దేవగన్‌, కాజోల్‌లు తమ కూతురు నీసా దేవగన్‌ను కాస్ట్‌లీ గిప్ట్‌తో సర్‌ప్రైజ్‌ చేశారు. కొంత కాలంగా ఉన్నత చదువుల కోసం సింగపూర్‌లో ఉంటున్న నీసాకు ఓ లగ్జరీ ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం సింగపూర్‌లోని యునైటెడ్‌ వరల్డ్ కాలేజ్‌లో చదువుతోంది నీసా.

ఆమె కోసం సింగపూర్‌లోని కాస్ట్‌లీ ఏరియా ఆర్చర్డ్‌ రోడ్‌లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను తీసుకున్నారు అజయ్‌, కాజోల్‌. ప్రస్తుతం చదువుతున్న కాలేజ్‌లో బోర్డింగ్‌ ఫెసిలిటీ ఉన్నా తమ కూతురు సొంత అపార్ట్‌మెంట్‌లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఈ గిఫ్ట్ ఇచ్చారట. వచ్చే ఏడాది జనవరిలో నీసా అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement