అది 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. సెమీస్ బెర్త్ కోసం చిన్నస్వామి స్టేడియం(బెంగళూరు) దాయాది దేశాల మధ్య జరిగిన పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. భారత్ నిర్దేశించిన 287 పరుగుల భారీ స్కోరును చేధించేందుకు పాక్ రంగంలోకి దిగింది. పాక్ ఓపెనర్లు సయ్యద్ అన్వర్, అమీర్ సోహైల్ తొలి 10 ఓవర్లలో 84 పరుగులు చేశారు. అన్వర్ అవుటయిన సోహైల్ జోరు తగ్గలేదు. దీంతో మ్యాచ్‌పై పట్టు సాధించిన ఆనందంలో సోహైల్ వరుస బౌండరీలు బాది టీమిండియా బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌ను రెచ్చగొట్టాడు. ఎక్స్‌ట్రా కవర్స్‌లో బంతిని కొట్టి ‘మళ్లీ అక్కడికే కొడతా... వెళ్లి తెచ్చుకో’ అంటూ బ్యాట్‌ను వెంకీ ఫేస్ వైపు చూపుతూ ఎగతాళి చేశాడు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన వెంకీ తర్వాతి బంతిని ఆఫ్‌స్టంప్ బయటకు వేశాడు. అంతే బంతిని టచ్ చేయబోయిన సోహైల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకీ ‘బా*ర్డ్... గో హోమ్’ అంటూ పెవిలియన్ వైపు దారి చూపడంతో స్వల్ప వివాదం చోటు చేసుకుంది. నేడు ఈ మాజీ పేస్ దిగ్గజం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ బీసీసీఐ ఆ మెమోరబుల్ వీడియోను ట్వీట్ చేసింది. అన్నట్లు ఈ మ్యాచ్‌లో భారత్ 39 పరుగులు తేడాతో నెగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment