టెండూల్కర్ కాదు! | fast bowler venkatesh prasad turned to actor | Sakshi
Sakshi News home page

టెండూల్కర్ కాదు!

Published Fri, Feb 21 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

టెండూల్కర్ కాదు!

టెండూల్కర్ కాదు!

ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ నటుడిగా మారారు. క్రికెట్ నేపథ్యంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ‘సచిన్’ అనే చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

 ఒకప్పటి ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ నటుడిగా మారారు. క్రికెట్ నేపథ్యంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ‘సచిన్’ అనే చిత్రంలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ నటి సుహాసిని ఓ కీలక పాత్రలో ఏఎన్‌ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై బీయన్ గంగాధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘టెండూల్కర్ కాదు’ అనేది ఉపశీర్షిక. ఎస్. మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల పలువురు చిత్రరంగ ప్రముఖుల సమక్షంలో బెంగళూరులో వైభవంగా జరిగింది.
 
  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మానవ సంబంధాల్ని హృద్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రానికి రాజేష్ రాంనాథ్ పాటలు స్వరపరుస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు సచిన్ టెండూల్కర్ అతిథిగా హాజరవుతారు. 30 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేస్తాం’’ అని చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement