న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ పంజాబ్ బౌలింగ్ కోచ్ పదవికి గత నెల్లో రాజీనామా చేసిన వెంకటేశ్ ప్రసాద్ స్థానంలో ఆసీస్ మాజీ క్రికెటర్ ర్యాన్ హారిస్‌ను నియమించారు. ఈ మేరకు హారిస్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ కింగ్స్ పంజాబ్ యాజమాన్యం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2019 సీజన్‌కు సంబంధించి డిసెంబర్ 18వ తేదీన జైపూర్‌లో వేలం జరుగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు ఆటగాళ్లను వదులుకుని వేలానికి సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు.. సహాయక సిబ్బందిని నియమించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ఇద్దరు విదేశీ మాజీ ఆటగాళ్లను కింగ్స్ పంజాబ్ తీసుకుంది. గతంలోనే క్రెయిగ్ మెక్‌మిల్లన్(న్యూజిలాండ్)ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించుకున్న పంజాబ్.. ఇప్పుడు ర్యాన్ హారిస్‌ను బౌలింగ్ కోచ్‌గా తెరపైకి తీసుకొచ్చింది.
కింగ్స్ పంజాబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా శ్రీదరన్ శ్రీరామ్ పని చేయనుండగా, ఫిజియోగా ఆసీస్‌కు చెందిన బ్రెట్ హార్రాప్ సపోర్టింగ్ స్టాఫ్‌లో చేరారు. హెడ్ కోచ్‌గా మైక్ హెసెన్ సేవలందించనుండగా, హై ఫెర్మామెన్స్ కోచ్‌గా ప్రసన్నా రామన్ పని చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment