సిక్స్‌తో గెలిపించిన శ్రీకర్‌ భరత్‌.. కోహ్లి రచ్చ రచ్చ | Kohli Celebrations After Srikar Bharath Last Ball Six Became Viral | Sakshi
Sakshi News home page

Virat Kohli Celebration: సిక్స్‌తో గెలిపించిన శ్రీకర్‌ భరత్‌.. కోహ్లి రచ్చ రచ్చ

Published Fri, Oct 8 2021 11:27 PM | Last Updated on Sat, Oct 9 2021 10:02 AM

Kohli Celebrations After Srikar Bharath Last Ball Six Became Viral - Sakshi

Kohli Celebrations After Srikar Bharath Six Last ball.. ఐపీఎల్‌ 2021లో ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిపించిన శ్రీకర్‌ భరత్‌ మ్యాచ్‌ హీరోగా మారిపోయాడు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన ఆర్‌సీబీని శ్రీకర్‌ భరత్‌ తన మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. డివిలియర్స్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన భరత్‌.. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్‌తో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఓవరాల్‌గా 52 బంతుల్లో 78 పరుగులు చేసిన భరత్‌కు ఐపీఎల్‌లో ఇదే మొయిడెన్‌ ఫిఫ్టీ కావడం విశేషం.

భరత్‌ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరమైన దశలో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో భరత్‌ లాంగాన్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టడంతో ఆర్‌సీబీ సంబరాల్లో మునిగిపోయింది. ముఖ్యంగా కోహ్లి విజయద్వానాలు చేస్తూ మైదానంలోకి పరిగెత్తి మిగిలిన ఆటగాళ్లతో సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి చేసిన రచ్చ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement