
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కోన శ్రీకర్ భరత్ (61; 9 ఫోర్లు, సిక్స్), రికీ భుయ్ (52; 5 ఫోర్లు) బాధ్యతాయుత ఆటతీరు కారణంగా... బెంగాల్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్రకు 21 పరుగులు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 108/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లకు 321 పరుగులు సాధించింది. రికీ భుయ్, భరత్ నాలుగో వికెట్‌కు 84 పరుగులు జత చేశారు. 290 పరుగుల స్కోరు వద్ద ఆంధ్ర ఎనిమిదో వికెట్ కోల్పోవడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభిస్తుందా లేదా అనే అనుమానం కలిగింది.
అయితే పృథ్వీ రాజ్ (12; 3 ఫోర్లు), శశికాంత్ (10 బ్యాటింగ్) తొమ్మిదో వికెట్‌కు 22 పరుగులు జతచేసి ఆంధ్రకు ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించారు. మరోవైపు పంజాబ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 155 పరుగులు చేసింది. అంతకుముందు పంజాబ్ 303 పరుగులకు ఆలౌటైంది. దాంతో హైదరాబాద్‌కు 14 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment