రోహిత్ శర్మ, హనుమ విహారి, శ్రీకర్ భరత్(PC: BCCI)
India Vs Leicestershire Warm Up Match: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు లీసెస్టర్‌షైర్ కౌంటీతో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలైంది. లీసెస్టర్‌లోని గ్రేస్‌రోడ్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ లీసెస్టర్‌ఫైర్ తరఫున బరిలోకి దిగారు.
మరోవైపు రోహిత్ శర్మలో సారథ్యంలోని భారత జట్టులో తెలుగు క్రికెటర్లు హనుమ విహారి, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ భాగమయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించాడు. కాగా గతేడాది పర్యటన సందర్భంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టీమిండియా తాజా పర్యటనలో భాగంగా రీషెడ్యూల్డ్ టెస్టుతో పాటు మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. కాగా గత టూర్‌లో భారత జట్టు 2-1 తేడాతో ఆధిక్యం సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ రీషెడ్యూల్డ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఇక భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆరంభమైన వార్మప్ మ్యాచ్.. లీసెస్టర్‌షైర్ కౌంటీ అఫీషియల్ యూట్యూబ్ చానల్ ‘ఫాక్సెస్ టీవీ’లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.
లీసెస్టర్‌షైర్ వర్సెస్ భారత్ వార్మప్ మ్యాచ్ జట్ల వివరాలు ఇలా:
లీసెస్టర్‌షైర్ జట్టు:
సామ్యూల్ ఈవన్స్(కెప్టెన్), లూయీస్ కింబర్, ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, రేహాన్ అహ్మద్, సామ్యూల్ బేట్స్(వికెట్ కీపర్), రోమన్ వాకర్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ, విల్ డేవిస్, నాథన్ బౌలే, అబిడినే సకాండే, జోయ్ ఎవిసన్.
భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, హనుమ విహారి, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.
📺 | 𝐋𝐈𝐕𝐄 𝐒𝐓𝐑𝐄𝐀𝐌
— Leicestershire Foxes 🏏 (@leicsccc) June 23, 2022
Watch @Jaspritbumrah93 bowling to @imro45 and @ShubmanGill live on Foxes TV. ⤵️https://t.co/adbXpwig48@BCCI 14/0 after four overs.
🦊 #IndiaTourMatch | #LEIvIND
That is some welcome for a practice game. Leicester is buzzing. #TeamIndia pic.twitter.com/uI5R6mafFV
— BCCI (@BCCI) June 23, 2022
Comments
Please login to add a commentAdd a comment