KS Bharat makes a cheeky remark to Axar Patel during Kanpur Test: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ అద్బుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మూడో రోజు ఆటను న్యూజిలాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు. అయితే ఆశ్విన్ బౌలింగ్‌లో విల్ యంగ్‌ను అద్బుతమైన క్యాచ్‌తో భరత్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. అంతేకాకుండా భరత్.. టామ్ లాథమ్‌ను స్టంప్ ఔట్ చేయగా, రాస్ టేలర్ క్యాచ్ కూడా అందుకున్నాడు.
కాగా వరుస క్రమంలో వికెట్లు కోల్పోతున్న న్యూజిలాండ్‌ను టామ్ బ్లండెల్, కైల్ జామీసన్ అదుకోనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్టంప్స్ వెనుక నుంచి భరత్.. బౌలింగ్ చేస్తున్న అక్షర్ పటేల్‌ను ఉత్సాహపరుస్తూ హిందీలో సరదాగా కామెంట్ చేశాడు. 'ఏక్ గిర్నే సే లైన్ లాగేగీ పీచే'( ఒకే ఒక వికెట్ తీయు అక్షర్, తరువాత లైన్ కడతారు) అంటూ ఉత్సాహపరిచాడు.
ఆ తరువాత కొద్ది సేపటికే.. అక్షర్ బౌలింగ్‌లో బ్లండెల్ క్లీన్ బౌల్డయ్యాడు. అంతేకాకుండా ఆశ్విన్ బౌలింగ్‌లో కూడా నల్ల పోద్రియే( నువ్వు మంచిగా బౌలింగ్ చేస్తున్నావు) అంటూ భరత్ తమిళంలో వాఖ్యలు చేశాడు. మెడ నొప్పితో మూడో రోజు ఆటకు దూరమైన వృద్దిమాన్ సహా స్ధానంలో శ్రీకర్ భరత్ సబ్‌స్ట్యూట్‌గా వచ్చాడు.
చదవండి: Ind Vs Nz 1st Test Day 4: సౌథీ దెబ్బ.. ఐదో వికెట్ కోల్పోయిన భారత్
Comments
Please login to add a commentAdd a comment