
తెలుగు ప్లేయర్ శ్రీకర్ భరత్ గురించి తెలుసా?
Ind Vs Nz Test Series- Who Is Srikar Bharat Interesting Facts: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన 16 మంది సభ్యుల జట్టులో ఆంధ్ర క్రికెటర్ కోన శ్రీకర్ భరత్‌కు చోటుదక్కింది. కొంతకాలంగా భారత్ ‘ఎ’ జట్లకు ఆడుతున్న ఈ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. టీమిండియా సంచలనం, టెస్టుల్లో పరిస్థితులకు తగ్గట్టు హిట్టింగ్ చేసే రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో రెండో కీపర్‌గానే భరత్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా జట్టులో ఉన్న సంగతి తెలిసిందే.
శ్రీకర్ భరత్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు
►ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన శ్రీకర్ భరత్ 1993, అక్టోబరు 3న జన్మించాడు.
►2012లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో శ్రీకర్ భరత్ అరంగేట్రం చేశాడు.
►28 ఏళ్ల శ్రీకర్ భరత్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటున్నాడు.
►78 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన భరత్ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు.
►2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో భరత్ 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
►రంజీల్లో ఈ ఘనత సాధించిన తొలి కీపర్‌గా నిలిచాడు.
ఇక ఐపీఎల్ విషయానికొస్తే..
►దూకుడైన బ్యాటర్‌గా పేరొందిన శ్రీకర్ భరత్‌ను ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. 20 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అంతకుముందు అతడు ఢిల్లీ డేర్‌డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు.
►ఐపీఎల్-2021 సీజన్‌లో కోహ్లి కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భరత్ 191 పరుగులు సాధించాడు.
►ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించాడు.
►ఇక న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు ఈ నెల 25 నుంచి 29 వరకు కాన్పూర్‌లో... రెండో టెస్టు డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబైలో జరుగుతుంది.
భారత టెస్టు జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శ్రీకర్ భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.
చదవండి: Ind Vs Nz Test Series: విహారిపై ఎందుకింత వివక్ష.. దెబ్బకు దిగొచ్చిన బీసీసీఐ.. ట్వీట్‌తో.. కానీ..