పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..! | Duleep Trophy 2024: Sanju Samson Did Not Get Chance In India D Match Vs India C | Sakshi
Sakshi News home page

పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!

Published Thu, Sep 5 2024 4:10 PM | Last Updated on Thu, Sep 5 2024 4:22 PM

Duleep Trophy 2024: Sanju Samson Did Not Get Chance In India D Match Vs India C

దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లు ఇవాల్టి (సెప్టెంబర్‌) నుంచి ప్రారంభమయ్యాయి. ఇండియా-ఏ, ఇండియా-బి మధ్య తొలి మ్యాచ్‌ బెంగళూరు వేదికగా జరుగుతుండగా.. ఇండియా-సి, ఇండియా-డి మధ్య రెండో మ్యాచ్‌ అనంతపురంలో జరుగుతుంది.

తొలి మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇండియా-బి మూడో సెషన్‌ సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్‌ కోసం ప్రాకులాడుతుంది. ముషీర్‌ ఖాన్‌ (77), నవ్‌దీప్‌ సైనీ (7) ఇండియా-బిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 30, అభిమన్యు ఈశ్వరన్‌ 13, సర్ఫరాజ్‌ ఖాన్‌ 9, రిషబ్‌ పంత్‌ 7, నితీశ్‌ రెడ్డి 0, వాషింగ్టన్‌ సుందర్‌ 0, సాయికిషోర్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, ఆకాశ్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో రెండు వికెట్లు తీశారు.

రెండో మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇండియా-డి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌటైంది. అక్షర్‌ పటేల్‌ 86 పరుగులు చేసి ఇండియా-డిని ఆదుకున్నాడు. 76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్‌.. అర్ష్‌దీప్‌ సింగ్‌తో (13) కలిసి తొమ్మిదో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు.

అక్షర్‌ మినహా ఇండియా-డిలో ఎవ్వరూ రాణించలేదు. అథర్వ తైడే 4, యశ్‌ దూబే 10, శ్రేయస్‌ అయ్యర్‌ 9, దేవ్‌దత్‌ పడిక్కల్ 0, రికీ భుయ్‌ 4, శ్రీకర్‌ భరత్‌ 13,సరాన్ష్‌ జైన్‌ 13, హర్షిత్‌ రాణా 0, అర్ష్‌దీప్‌ సింగ్‌ 13 పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌, హిమాన్షు చౌహన్‌ చెరో 2, మానవ్‌ సుతార్‌, హృతిక్‌ షొకీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-సి 17 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (5), సాయి సుదర్శన్‌ (7), ఆర్యన్‌ జుయెల్‌ (12) ఔట్‌ కాగా.. రజత్‌ పాటిదార్‌ (13), బాబా ఇంద్రజిత్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

పాపం సంజూ.. ఇక్కడ కూడా అవకాశం దక్కలే..!
రెండో మ్యాచ్‌కు ముందు ఇండియా-డి ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ గాయపడటంతో సంజూ శాంసన్‌ జట్టులోకి వచ్చాడు. సంజూ తుది జట్టులో ఉండటం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే మేనేజ్‌మెంట్‌ అనూహ్యంగా సంజూను పక్కన పెట్టి శ్రీకర్‌ భరత్‌కు తుది జట్టులోకి తీసుకుంది. 

ఇండియా-సితో మ్యాచ్‌లో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుని టెస్ట్‌ జట్టులో చోటు కొట్టేయాలని సంజూ భావించాడు. చివరికి అతని ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement