Pic Credit: Star Sports Telugu
ఐపీఎల్ 2024 సీజన్‌లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు.
- గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతుండగా..
- విశాఖకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు..
- విశాఖకు చెందిన కోన శ్రీకర్ భరత్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు..
- హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ రియాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు..
- హైదరాబాద్‌కే చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌కు..
- హైదరాబాద్‌కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంపికయ్యారు.
తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తెలుగు వారియర్స్‌కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్ ఐపీఎల్‌లో ఆడుతున్నారు.
‘తగ్గేదే లే’ అంటూ
— StarSportsTelugu (@StarSportsTel) March 22, 2024
తెలుగు సత్తా చూపేందుకు 💥
మన స్టార్స్ వచ్చేస్తున్నారు 🤩
మరి వీరిలో ఈ సీజన్ ఎవరు మెరిపిస్తారు?
చూడండి#TATAIPL | Chennai v Bengaluru | 5 PM నుండి
మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/E4CW9z7aMj
ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్ (మధ్యప్రదేశ్) ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనుండగా.. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్ త్యాగరాజన్ (బెంగళూరు) పంజాబ్ కింగ్స్‌కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది.
తుది జట్లు (అంచనా):
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్
Comments
Please login to add a commentAdd a comment