ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే సిరాజ్ దారుణంగా విఫలమవుతున్నాడు. వికెట్లు విషయం పక్కన పెడితే రన్స్‌ను కూడా భారీగా సమర్పించుకుంటున్నాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు.
ముంబైతో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 37 పరుగులిచ్చాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఈ హైదరాబాదీ 57. 25 సగటుతో కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో మహ్మద్ సిరాజ్‌ను ఉద్దేశించి భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరాజ్ బాగా ఆలిసిపోయాడని, అతడికి కొన్ని మ్యాచ్‌లకు విశ్రాంతి ఇవ్వాలని ఆర్సీబీ మెనెజ్‌మెంట్‌ను భజ్జీ సూచించాడు.
"మహ్మద్ సిరాజ్ మానసికంగా, ఫిజికల్‌గా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. అతడికి ప్రస్తుతం విశ్రాంతి అవసరం. అతడు గత కొంత కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. సిరాజ్ ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. నేనే ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో భాగమైతే అతడికి రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇస్తాను.
ఏమి జరుగుతుందో తను ఆర్ధం చేసుకోవడానికి అతడికి ఆ సమయం ఉపయోగపడుతోంది. సిరాజ్ అద్బుతమైన బౌలర్ అని మనకు తెలుసు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా కొత్త బంతితో వికెట్లు తీయడం అతడి స్పెషల్. కచ్చితంగా ముంబైతో మ్యాచ్ అతడికి పీడ కలవంటింది. కానీ సిరాజ్‌కు రెస్ట్ ఇస్తే అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇస్తాడని నేను నమ్ముతున్నాను. గతంలో నేను కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నానని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment