Telugu Cricketer
-
ఐపీఎల్ ‘హిట్’ షోకు తెలుగు క్రికెటర్లు రెడీ!
ఐపీఎల్ 2024 సీజన్లో సత్తా చాటేందుకు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్ వేలంలో మొత్తం 11 మంది పాల్గొనగా.. ఆరుగురు క్రికెటర్లు వివిధ జట్లకు ఎంపికయ్యారు. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతుండగా.. విశాఖకు చెందిన కాకి నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు.. విశాఖకు చెందిన కోన శ్రీకర్ భరత్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు.. హైదరాబాద్‌కు చెందిన మొహమ్మద్ రియాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు.. హైదరాబాద్‌కే చెందిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌కు.. హైదరాబాద్‌కే చెందిన అరవెల్లి అవినీశ్ రావు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంపికయ్యారు. తెలుగోళ్ల సత్తా చాటడానికి సిద్ధం అని స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఓ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తెలుగు వారియర్స్‌కు శుభాంకాంక్షలు తెలిపింది. పై పేర్కొన్న ఆరుగురే కాక తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ సీజన్ ఐపీఎల్లో ఆడుతున్నారు. ‘తగ్గేదే లే’ అంటూ తెలుగు సత్తా చూపేందుకు 💥 మన స్టార్స్ వచ్చేస్తున్నారు 🤩 మరి వీరిలో ఈ సీజన్ ఎవరు మెరిపిస్తారు? చూడండి#TATAIPL | Chennai v Bengaluru | 5 PM నుండి మీ #StarSportsTelugu లో#IPLonStar pic.twitter.com/E4CW9z7aMj — StarSportsTelugu (@StarSportsTel) March 22, 2024 ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు సారథ్యం వహిస్తున్న రికీ భుయ్ (మధ్యప్రదేశ్) ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనుండగా.. హైదరాబాద్ రంజీ జట్టుకు ఆడుతున్న తనయ్ త్యాగరాజన్ (బెంగళూరు) పంజాబ్ కింగ్స్‌కు ఎంపికయ్యారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎనిమిది మంది క్రికెటర్లు ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
ఐపీఎల్ 2024 వేలంలో అదృష్టం పరీక్షించుకోనున్న తెలుగు ఆటగాళ్లు వీరే..!
దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీరాజ్ యర్రాలకు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ యర్రా 2 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, 24 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 284 పరుగులు) కేఎస్ భరత్ (30) (వైజాగ్, వికెట్‌కీపర్ బ్యాటర్, 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 199 పరుగులు, ఓ హాఫ్ సెంచరీ) పృథ్వీరాజ్ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, 2 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో (కేకేఆర్) ఓ వికెట్) రోహిత్ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్) అనికేత్ రెడ్డి (23) (నిజామాబాద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్) రవి తేజ (29) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మనీశ్ రెడ్డి (24) (హైదరాబాద్, ఆల్‌రౌండర్) మురుగన్ అభిషేక్ (19) (హైదరాబాద్, స్పిన్ బౌలర్) ఎర్రవల్లి అవనీశ్ రావ్ (19) (హైదరాబాద్, బ్యాటర్) రక్షణ్ రెడ్డి (23) (హైదరాబాద్, మీడియ పేసర్) రాహుల్ బుద్ది (26) (హైదరాబాద్, బ్యాటర్, 2022లో ముంబై ఇండియన్స్ సభ్యుడు) ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023 సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం) ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ) డిజిటల్: జియో సినిమా మొత్తం స్లాట్లు: 77 వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333 భారతీయ ఆటగాళ్లు: 214 విదేశీ ఆటగాళ్లు: 119 -
Sunrisers Hyderabad: పేరుకే మనది.. తెలుగువారి జాడ ఏది..?
IPL 2023: ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ ప్రాంతానికి చెందిన పేరును జట్టుకు పెట్టుకున్నప్పుడు ఒకరిద్దరు స్థానిక ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం అనవాయితీగా వస్తుంది. ఉదాహరణకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని తీసుకుంటే, ఆ జట్టు కెప్టెన్‌తో సహా నలుగురు మహారాష్ట్రీలకు జట్టులో (ఐపీఎల్-2023) చోటు దక్కింది. దాదాపు ఇదే సంప్రదాయాన్ని ఆ లీగ్ ఈ లీగ్ అని తేడా లేకుండా అన్ని లీగ్‌ల్లో పాటిస్తుంటారు. అయితే ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ అనవాయితీని తుంగలో తొక్కి, స్థానిక ఆటగాళ్లను చిన్నచూపు చూసింది. పేరుకే అది హైదరాబాద్ జట్టు కానీ, అందులో ఒక్క హైదరాబాదీ లేడు. కేవలం ఒక్కడే తెలుగువాడు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన 19 ఏళ్ల కాకి నితీశ్ కుమార్ రెడ్డిని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కనీస ధర 20 లక్షలకు దక్కించుకుంది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన నితీశ్‌ను కూడా 2023 వేలం చివర్లో కంటితుడుపు చర్యగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సొంతం చేసుకుంది. పేరుకు హైదరాబాద్ ఫ్రాంచైజీ ఒక్కరు కూడా తెలుగువారు లేకపోతే బాగుండదని ఈ ఎంపిక జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీకర్ భరత్, తిలక్ వర్మ తదితర ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు సహచర ఫ్రాంచైజీలు ఎగబడుతుంటే, ఎస్ఆర్హెచ్ యజమాని కావ్య మారన్ మాత్రం పక్క రాష్ట్రాల ఆటగాళ్లవైపు చూసింది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగినా, తమ పేరుతో ఉన్న ఫ్రాంచైజీ మాత్రం ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని ఎస్ఆర్హెచ్ అభిమానులు కోరుకోవడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 16వ ఎడిషన్ మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ జెయింట్స్-ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో సీజన్ ప్రారంభంకానుంది. సన్‌రైజర్స్ తమ సీజన్ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడుతుంది. అబ్దుల్ సమద్ (జమ్మూ అండ్ కశ్మీర్) అన్మోల్ ప్రీత్ సింగ్ (పంజాబ్) ఎయిడెన్ మార్క్రమ్ (సౌతాఫ్రికా) రాహుల్ త్రిపాఠి (జార్ఖండ్) మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్) నితీశ్ రెడ్డి (వైజాగ్) సమర్థ్ వ్యాస్ (సౌరాష్ట్ర) సన్వీర్ సింగ్ (పంజాబ్) వాషింగ్టన్ సుందర్ (తమిళనాడు) మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా) అభిషేక్ శర్మ (పంజాబ్) వివ్రాంత్ శర్మ (జమ్మూ) హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా) గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) ఉపేంద్ర యాదవ్ (ఉత్తర్‌ప్రదేశ్) అకీల్ హొసేన్ (వెస్టిండీస్) మయాంక్ డాగర్ (ఢిల్లీ) ఫజల్హక్ ఫారూఖీ (ఆఫ్ఘనిస్తాన్) కార్తీక్ త్యాగీ (ఉత్తర్‌ప్రదేశ్) భువనేశ్వర్ కుమార్ (ఉత్తర్‌ప్రదేశ్) మయాంక్ మార్కండే (పంజాబ్) టి నటరాజన్ (తమిళనాడు) ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) ఉమ్రాన్ మాలిక్ (జమ్మూ అండ్ కశ్మీర్)