దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు (డిసెంబర్ 19) జరుగబోయే ఐపీఎల్ 2024 వేలంలో 11 మంది తెలుగు క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో హనుమ విహారి, కేఎస్ భరత్, పృథ్వీరాజ్ యర్రాలకు గతంలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. విహారి 24, కేఎస్ భరత్ 10, పృథ్వీరాజ్ యర్రా 2 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు.
- హనుమ విహారి (30) (కాకినాడ, బ్యాటింగ్ ఆల్‌రౌండర్, 24 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 284 పరుగులు)
- కేఎస్ భరత్ (30) (వైజాగ్, వికెట్‌కీపర్ బ్యాటర్, 10 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 199 పరుగులు, ఓ హాఫ్ సెంచరీ)
- పృథ్వీరాజ్ యర్రా (25) (గుంటూరు, లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, 2 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో (కేకేఆర్) ఓ వికెట్)
- రోహిత్ రాయుడు (29) (గుంటూరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్)
- అనికేత్ రెడ్డి (23) (నిజామాబాద్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్)
- రవి తేజ (29) (హైదరాబాద్, ఆల్‌రౌండర్)
- మనీశ్ రెడ్డి (24) (హైదరాబాద్, ఆల్‌రౌండర్)
- మురుగన్ అభిషేక్ (19) (హైదరాబాద్, స్పిన్ బౌలర్)
- ఎర్రవల్లి అవనీశ్ రావ్ (19) (హైదరాబాద్, బ్యాటర్)
- రక్షణ్ రెడ్డి (23) (హైదరాబాద్, మీడియ పేసర్)
- రాహుల్ బుద్ది (26) (హైదరాబాద్, బ్యాటర్, 2022లో ముంబై ఇండియన్స్ సభ్యుడు)
ఐపీఎల్ 2024 వేలం తేదీ: డిసెంబర్ 19, 2023
సమయం: మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభం (భారతకాలమానం ప్రకారం)
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ (టీవీ)
డిజిటల్: జియో సినిమా
మొత్తం స్లాట్‌లు: 77
వేలంలో పాల్గొంటున్న మొత్తం ఆటగాళ్లు: 333
భారతీయ ఆటగాళ్లు: 214
విదేశీ ఆటగాళ్లు: 119
Comments
Please login to add a commentAdd a comment