ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 137/5
గుజరాత్ 367 ఆలౌట్
రంజీ ట్రోఫీ
అహ్మదాబాద్: సహచరులు విఫలమైన చోట వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (72 బంతుల్లో 78 బ్యాటంగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఫలితంగా గుజరాత్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తేరుకోగలిగింది. గ్రూప్ ‘బి’లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. శ్రీకర్ భరత్‌తో పాటు... ఇటీవల బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌లో మెరుపులు మెరిపించిన నితీశ్ కుమార్ రెడ్డి (34; 6 ఫోర్లు) సత్తా చాటాడు.
కెప్టెన్ రికీ భుయ్ (9), హనుమ విహారి (0), షేక్ రషీద్ (1), మహీప్ కుమార్ (0), అభిõÙక్ రెడ్డి (15) విఫలమయ్యారు. దీంతో ఒక దశలో ఆంధ్ర జట్టు 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఒకవైపు గుజరాత్ బౌలర్లు విజృంభిస్తుంటే... ఆంధ్ర బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు. ఈ దశలో ఆత్మరక్షణ ధోరణి వీడిన శ్రీకర్ భరత్ ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. అతడికి నితీశ్ కుమార్ రెడ్డి కూడా తోడవడంతో ఆంధ్ర జట్టు కోలుకోగలిగింది. ఈ జంట అబేధ్యమైన ఆరో వికెట్‌కు 107 పరుగులు జోడించింది.
గుజరాత్ బౌలర్లలో చింతన్ గాజా 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 289/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ చివరకు 106 ఓవర్లలో 367 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ చింతన్ గాజా (152 బంఉత్లో 92; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకోగా... అర్జాన్ నాగ్‌వస్వల్లా (82 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయంగా నిలిచాడు.
ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, లలిత్ మోహన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం చేతిలో ఐదు వికెట్లు ఉన్న ఆంధ్ర జట్టు... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. శ్రీకర్ భరత్, నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు.
స్కోరు వివరాలు
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 367;
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõÙక్ రెడ్డి (సి) మనన్ హింగ్రాజియా (బి) జడేజా 15; మహీప్ కుమార్ (సి) ఉర్విల్ పటేల్ (బి) అర్జాన్ 0; షేక్ రషీద్ (సి) మనన్ హింగ్రాజియా (బి) చింతన్ గాజా 1; హనుమ విహారి (బి) చింతన్ గాజా 0; రికీ భుయ్ (సి) ఉర్విల్ పటేల్ (బి) చింతన్ గాజా 9; శ్రీకర్ భరత్ (నాటౌట్) 78; నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 34; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (32 ఓవర్లలో 5 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–4, 2–5, 3–5, 4–25, 5–29, బౌలింగ్: చింతన్ గాజా 9–1–40–3; అర్జాన్ 7–1–22–1; ప్రియాజిత్‌సింగ్ జడేజా 3.5–0–25–1; సిద్ధార్థ్ దేశాయ్ 8–1–27–0; జయ్‌మీత్ పటేల్ 0.1–0–0–0, రవి బిష్ణోయ్ 4–0–23–0
Comments
Please login to add a commentAdd a comment