
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్‌లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో సౌత్ జోన్‌తో నార్త్ జోన్; వెస్ట్ జోన్‌తో సెంట్రల్ జోన్ తలపడతాయి.
సెంట్రల్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్‌తో మ్యాచ్‌లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు.