ఐదేసిన సౌరభ్‌ కుమార్‌.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్‌ | Saurabh Kumar Takes Five For As India A Clinch Test Series With 113 Run Win | Sakshi
Sakshi News home page

IND A VS NZ A 3rd Test: ఐదేసిన సౌరభ్‌ కుమార్‌.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్‌

Published Sun, Sep 18 2022 7:07 PM | Last Updated on Sun, Sep 18 2022 7:07 PM

Saurabh Kumar Takes Five For As India A Clinch Test Series With 113 Run Win - Sakshi

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌-ఏతో జరిగిన మూడో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌-ఏ జట్టు ఘన విజయం సాధించింది. చివరి రోజు ఆటలో స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌ ఐదు వికెట్లతో (5/103) చెలరేగడంతో టీమిండియా 113 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 406 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్‌ అద్భుతమైన పోరాటం కనబర్చి 302 పరుగుల వద్ద ఆలౌటైంది.

కివీస్‌ బ్యాటర్ జో కార్టర్‌ (230 బంతుల్లో 111; 12 ఫోర్లు, సిక్స్‌) అద్భుతమై శతకంతో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేయగా.. డీన్‌ క్లీవర్‌ (60 బంతుల్లో 44; 9 ఫోర్లు), మార్క్‌ చాప్‌మన్‌ (61 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్‌) తమ వంతు ప్రయత్నం చేశారు. భారత బౌలర్లలో సౌరభ్‌ కుమార్‌తో పాటు సర్ఫరాజ్‌ ఖాన్‌ (2/48), ఉమ్రాన్‌ మాలిక్‌ (1/62), శార్ధూల్‌ ఠాకూర్‌ (1/44), ముకేశ్‌ కుమార్‌ (1/39) రాణించారు.

3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు డ్రా కాగా, ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపొందింది. ఈ సిరీస్‌ తర్వాత భారత్ ఇదే జట్టుతో మూడు అనధికారిక వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌ 22, 25, 27 తేదీల్లో ఈ మ్యాచ్‌లు చెన్నై వేదికగా జరుగనున్నాయి. 

స్కోర్‌ వివరాలు..
భారత్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌: 293 ఆలౌట్‌ (రుతురాజ్‌ గైక్వాడ్‌ 108, ఉపేంద్ర యాదవ్‌ 76; మ్యాథ్యూ ఫిషర్‌ 4/52)

న్యూజిలాండ్‌-ఏ తొలి ఇన్నింగ్స్‌: 237 ఆలౌట్‌ (మార్క్‌ చాప్‌మన్‌ 92, సోలియా 54; సౌరభ్‌ కుమార్‌ 4/48, రాహుల్‌ చాహర్‌ 3/53)

భారత్‌-ఏ రెండో ఇన్నింగ్స్‌: 359/7 డిక్లేర్‌ (రజత్‌ పాటిదార్‌ 109, రుతురాజ్‌ 94, ప్రియాంక్‌ పంచల్‌ 62; రచిన్‌ రవీంద్ర 3/65)

న్యూజిలాండ్‌-ఏ రెండో ఇన్నింగ్స్‌: 302 ఆలౌట్‌ (జో కార్టర్‌ 111, మార్క్‌ చాప్‌మన్‌ 45; సౌరభ్‌ కుమార్‌ 5/103) 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement