Bangladesh A vs India A, 1st unofficial Test: బంగ్లాదేశ్- ఏతో అనధికారిక టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో మెరిశారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ 4 వికెట్లతో చెలరేగగా.. పేసర్ నవదీప్ సైనీ 3 వికెట్లు కూల్చాడు. వీరిద్దరికి తోడు ముకేశ్ కుమార్ రాణించడంతో బంగ్లా జట్టు 112 పరుగులకే కుప్పకూలింది.
కాగా టీమిండియా కంటే ముందు భారత- ఏ జట్టు బంగ్లాదేశ్‌కు పయనమైన విషయం తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా బంగ్లాదేశ్- ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టు(నాలుగు రోజుల మ్యాచ్)లు ఆడనుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం మొదటి టెస్టు ఆరంభమైంది.
టాస్ గెలిచి
కాక్స్ బజార్ వేదికగా ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ అభిమన్య ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. సారథి నమ్మకాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు విజృంభించారు. నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్ చెలరేగడంతో బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ కకావిలకమైంది.
ఓపెనర్లు మహ్మదుల్ హసన్ జాయ్ 1, జాకిర్ హసన్ 0 పరుగులకే అవుట్ కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన షాంటో 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మొమినుల్ 4 పరుగులకే అవుట్ కాగా.. కెప్టెన్ మహ్మద్ మిథున్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
మొసద్దెక్ ఒంటరి పోరాటం
ఈ క్రమంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మొసద్దెక్ హొసేన్ 63 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సౌరభ్ కుమార్ అతడిని పెవిలియన్‌కు పంపడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగింపునకు చేరుకుంది. ఈ క్రమంలో 45 ఓవర్లలో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి బంగ్లా- ఏ జట్టు ఆలౌట్ అయింది. సౌరభ్‌కు 4, నవదీప్‌నకు మూడు, ముకేశ్ కుమార్‌కు రెండు, అతిత్ షేత్‌కు ఒక వికెట్ దక్కాయి.
చదవండి: 6 Sixes In An Over: ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టింది వీళ్లే! ఇక రుతు 7 సిక్సర్లు బాదితే.. అతడు ఏకంగా 8!
SL Vs AFG: ఒకేరోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు లంక యువ క్రికెటర్లు! ఓవైపు సిరీస్ ఆడుతూనే..
Comments
Please login to add a commentAdd a comment