Delhi cricketer
-
వారెవ్వా.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూపు-డిలో భాగంగా ఇండోర్ వేదికగా ఢిల్లీ, మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు శరాన్ష్ జైన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఢిల్లీ మిడిలార్డర్ ఆటగాడు వైభవ్ కంద్పాల్ని శరాన్ష్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 44 ఓవర్లో రెండో బంతిని వైభవ్ కంద్పాల్ బౌలర్ ఎండ్ వై డిఫెన్స్ ఆడాడు. ఈ క్రమంలో బౌలర్ శరాన్ష్ జైన్ తన కుడివైపు మెరుపు వేగంతో డైవ్ చేస్తూ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. దీంతో శరాన్ష్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 205 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో యష్ ధుల్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, అర్యన్ పాండే తలా మూడు వికెట్లతో చెలరేగారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగుల అధిక్యం లభించింది. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! I.C.Y.M.I How's that for a catch❓ Madhya Pradesh's Saransh Jain pulled off a superb caught and bowled to dismiss Delhi's Vaibhav Kandpal 👌👌 Relive the fantastic grab 🔽@IDFCFIRSTBank | #RanjiTrophy | #MPvDEL Follow the match ▶️ https://t.co/gn30dZUkO4 pic.twitter.com/lTCP9qy7Gz — BCCI Domestic (@BCCIdomestic) January 20, 2024 -
ఢిల్లీకి ఊహించని షాక్.. 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పుదుచ్చేరి
రంజీ ట్రోఫీ-2024 సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోనుంది. పుదుచ్చేరి చారిత్రత్మక విజయంలో పేసర్ గౌరవ్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించిన గౌరవ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 3 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 10 వికెట్లు పడగొట్టి గౌరవ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 148 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్ త్యాగీ(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పుదుచ్చేరి తమ మొదటి ఇన్నింగ్స్‌ను 244 పరుగుల వద్ద ముగించి 96 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ అదే ఆటతీరును కొనసాగించింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం కేవలం 145 పరుగుల చూపచుట్టేసింది. ఈ క్రమంలో 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పుదుచ్చేరి ముందు ఢిల్లీ ఉంచగల్గింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా కెప్టెన్ ధుల్ విఫలమయ్యాడు. చదవండి: Pak Vs NZ: పాక్ క్రికెట్‌తో ప్రయాణం ముగిసిపోయింది.. ఇక సెలవు! -
ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా యశ్ ధుల్.. 20 ఏళ్ల వయస్సులోనే
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ తొలి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు 20 ఏళ్ల యశ్ ధుల్ సారథ్యం వహించనున్నాడు. జట్టులో ఇషాంత్ శర్మ, నితీష్ రాణా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు మేనేజేమెంట్ యశ్ ధుల్కి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. కాగా అతడి సారథ్యంలోనే యువ భారత జట్టు ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకుంది. అతడి కెప్టెన్సీ నైపుణ్యాలు చూసి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక గత రంజీ సీజన్ లో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన యశ్‌దుల్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 820 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఏడాది రంజీ సీజన్లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్రతో తలపడనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి పుణే వేదికగా ప్రారంభం కానుంది. ఢిల్లీ జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), హిమ్మత్ సింగ్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ షోరే, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), వైభవ్ రావల్, లలిత్ యాదవ్,నితీష్ రాణా, ఆయుష్ బదోని, హృతిక్ షోకీన్, శివంక్ వశిష్త్, వికాస్ మిశ్రా, జాంటీ సిద్ధు, ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, సిమర్జీత్ సింగ్ లక్షయ్ థరేజా, ప్రన్షు విజయరన్ -
‘కెంట్’ తరఫున కౌంటీల్లో నవదీప్ సైనీ
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో మరో భారత పేస్ బౌలర్‌కు అవకాశం దక్కింది. 29 ఏళ్ల ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీ ‘కెంట్’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ సీజన్లో 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 5 వన్డేలలో అతను ‘కెంట్’కు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ టీమ్‌కు ఆడనున్న రెండో భారత క్రికెటర్ సైనీ. తాజా సీజన్లో కౌంటీలు ఆడుతున్న భారత ఆటగాళ్ల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే పుజారా, సుందర్, కృనాల్, ఉమేశ్ యాదవ్ ఒప్పందాలు చేసుకున్నారు. భారత్‌కు 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టి20ల్లో ప్రాతినిధ్యం వహించిన సైనీ మూడు ఫార్మాట్లలో కలిపి 23 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టాడు. అతను జాతీయ జట్టు తరఫున ఆడి దాదాపు ఏడాదవుతోంది. చరిత్రాత్మక ‘బ్రిస్బేన్ టెస్టు’ విజయం తర్వాత సైనీకి మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. -
18 నెలల్లో టీమిండియాలోకి వస్తా.. యశ్ ధుల్
అండర్-19 ప్రపంచకప్‌లో యంగ్ ఇండియాను జగజ్జేతగా నిలబెట్టి, రాత్రికిరాత్రి హీరోగా మారిపోయిన యశ్ ధుల్.. టీమిండియాలో చోటు సంపాదించేందుకు తనకు తాను టార్గెట్‌ను సెట్ చేసుకున్నానని తెలిపాడు. మరో 18 నెలల్లో టీమిండియాకు తప్పక ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ టార్గెట్‌ను రీచ్ కాని పక్షంలో మరింతగా శ్రమిస్తానని, భారత జట్టులో స్థానం సంపాదించడం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నానని, ఇందుకు తన కుటుంబ సభ్యులు కూడా ప్రిపేరై ఉన్నారని వెల్లడించాడు. ఢిల్లీ రంజీ జట్టు నుంచి పిలుపు అందుకున్న అనంతరం ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ధుల్ ఈ విషయాలను ప్రస్తావించాడు. టీమిండియా స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని అమితంగా ఆరాధిస్తానని, అతని అనువనువును రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పిన ధుల్.. కోహ్లి తరహాలోనే తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటానని తెలిపాడు. ప్రపంచకప్ విజయానంతరం తనపై పెరిగిన అంచనాల దృష్ట్యా ఒత్తిడికి లోనవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించదలచుకోలేదని, దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, లక్ష్యం దిశగా సాగడంపైనే తన దృష్టంతా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్ గెలిచాక కోహ్లితో ఓసారి మాట్లాడానని, అతను తన అండర్-19 ప్రపంచకప్ అనుభవాలను తనతో పంచుకున్నాడని చెప్పాడు. వరల్డ్ కప్ విజయానంతరం సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకుని మంగళవారం స్వదేశానికి చేరుకున్నామని, సొంతగడ్డపై అడుగుపెట్టిన నాటి నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతున్నానని, కొద్ది రోజులు విరామం తీసుకుని రంజీ ప్రాక్టీస్‌లో పాల్గొంటానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా, ఢిల్లీ నుంచి విరాట్ కోహ్లి, ఉన్ముక్త్ చంద్ల తర్వాత భారత అండర్-19 జట్టును విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్‌గా యశ్ ధుల్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. వీరిలో కోహ్లి కెరీర్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించగా, ఉన్ముక్త్ చంద్ మాత్రం ఆశించిన ప్రదర్శన కనబర్చలేక కనుమరుగైపోయాడు. చదవండి: IPL 2022 : బ్యాడ్ న్యూస్.. వార్నర్ సహా పలువురు స్టార్ క్రికెటర్లు దూరం..? -
IPL: విరాట్ కోహ్లి సహచరుడిపై పోలీసుల దాడి..!
Vikas Tokas: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సహచరుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు వికాస్ తోకాస్పై ఢిల్లీ పోలీసులు దాడి చేశారని తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ నెల 26న ఢిల్లీ శివారులోని ఓ గ్రామం వద్ద వికాస్ తోకాస్ కారును సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారు. ఆ సమయంలో మాస్క్ ధరించకపోవడంతో రూ.2000 ఫైన్ కట్టాలని వారు వికాస్‌ను ఆదేశించారు. Delhi | On Jan 26, some police personnel stopped my car &asked for Rs 2000 alleging that I wasn't wearing a mask.When I countered them they sat inside my car, abused me. One of them was Puran Meena who punched me. They took me to PS alleging that I was fleeing with a rifle: Vikas pic.twitter.com/RHMfuikoLf — ANI (@ANI) January 28, 2022 అయితే అతను ఫైన్ కట్టనని చెప్పడంతో చిర్రెత్తిపోయిన పోలీసులు అతన్ని కారులో నుంచి కిందకు లాగి ముఖంపై పిడిగద్దులు గుద్దారు. దీంతో అతని కంటి భాగంలో బలమైన గాయాలయ్యాయి. అయితే ఇక్కడ పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. వికాస్ రైఫిల్‌తో పారిపోతుండగా తాము పట్టుకున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. Delhi | On #RepublicDay2022, Vikas Tokas was stopped for checking & not wearing a mask in a public place but instead of cooperating, he arrogantly started misbehaving, asking how a constable rank official dared to stop a national-level cricket player: DCP South West Gaurav Sharma pic.twitter.com/UeVCHjb7sU — ANI (@ANI) January 28, 2022 కాగా, వికాస్ పోలీసులపై చేసిన ఆరోపణలను సౌత్ వెస్ట్ డీసీపీ గౌరవ్ శర్మ ఖండించారు. తాను జాతీయ స్థాయి క్రికెటర్‌నని, తననే జరిమానా కట్టమంటావా అని వికాసే తమ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడాడంటూ ప్రత్యారోపణలు చేశాడు. అయితే, ఈ విషయంలో పోలీసులంతా కుమ్మక్కయ్యారని, ఉన్నతాధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలని వికాస్ విజ్ఞప్తి చేశాడు. ఇదిలా ఉంటే, 2016 ఐపీఎల్ వేలం సందర్భంగా వికాస్ తోకాస్ను ఆర్సీబీ 10 లక్షల బేస్ ప్రైజ్ చెల్లించి దక్కించుకుంది. అయితే క్యాష్ రిచ్ లీగ్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. దీంతో ఆ తర్వాత సీజన్లలో అతను ఐపీఎల్లో కనిపించలేదు. వికాస్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అయిన అతను 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 11 లిస్ట్ ఏ, 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 67 వికెట్లు 219 పరుగులు చేశాడు. చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..! -
కెప్టెన్ విరాట్ కోహ్లి సన్మానం రద్దు
భారత్, ఆస్ట్రేలియా చివరి వన్డే సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లిని సన్మానించాలని భావించిన ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఇటీవల జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో డీడీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ‘ఢిల్లీ దిగ్గజాలు’ కోహ్లి, సెహ్వాగ్, గంభీర్‌లను ఒకేసారి బుధవారం ఐదో వన్డేకు ముందు సత్కరించాలనేది డీడీసీఏ ఆలోచన. అయితే బీసీసీఐ కూడా ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకున్న కారణంగా తాము ఇలాంటి కార్యక్రమం తలపెట్టడం సముచితం కాదని భావించినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు. -
‘ఏ క్రికెట్ ఆడకుండా వాడిపై నిషేధం విధించండి’
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై జరిగిన దాడి ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాడి చేసిన ఆ యువ క్రికెటర్‌ను ఏ క్రికెట్ ఆడకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశాడు. ఇక ఢిల్లీ అండర్–23 జట్టులోకి తన ఎంపికను తిరస్కరించినందుకు కక్ష పెంచుకున్న అనూజ్ దేడా అనే యువకుడు డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన అమిత్ భండారిపై సోమవారం గుంపుతో కలిసి వచ్చి దాడికి దిగిన విషయం తెలిసిందే. రౌడీల్లా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అమిత్‌పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆటగాడే అయిన గంభీర్.. ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. ‘దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సదరు ఆటగాడిపై ఏ క్రికెట్ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలి’ అని గంభీర్ డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై మాజీ డాషింగ్ ఓపెనర్, ఢిల్లీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం స్పందించాడు. ‘జట్టులో ఎంపికచేయలేదని సెలక్టర్‌పై దాడి చేయడం అమానుషం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.’ అని ట్వీట్ చేశారు. దాడికి గురైన 40 ఏళ్ల అమిత్ భండారి దేశానికి 2000–2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. ఇక భండారిపై దాడికి పాల్పడిన అనూజ్ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఢిల్లీ చీఫ్ సెలక్టర్ అమిత్ భండారిపై దాడి
న్యూఢిల్లీ: ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఆటగాళ్ల ఎంపికలో నిబంధనల ఉల్లంఘనలతో అప్రతిష్ఠ పాలైన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మరో అవాంఛనీయ ఘటన. ఢిల్లీ అండర్–23 జట్టులోకి తన ఎంపికను తిరస్కరించినందుకు కక్ష పెంచుకున్న అనూజ్ దేడా అనే యువకుడు ఏకంగా... భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం గుంపుతో కలిసి వచ్చి దాడికి దిగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అనూజ్ బృందం దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టారు. తల, చెవి భాగంలో గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చేలోగా నిందితులు పారిపోయారు. పరిస్థితిని గ్రహించిన క్రికెటర్లు అడ్డుకునేందుకు ముందుకొచ్చారు. ఎవరూ కలుగజేసుకోవద్దంటూ నిందితులు తుపాకీ చూపించి బెదిరించారు. మరోవైపు అనూజ్ విషయంలో భండారి నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. నవంబరులో 79 మందితో డీడీసీఏ విడుదల చేసిన అండర్– 23 ప్రాథమిక జాబితాలో అతడి పేరున్నా, ప్రదర్శన బాగోలేకపోవడంతో పక్కన పెట్టారు. అనూజ్ 1995 నవంబరు 22న జన్మించడంతో ఎంపికకు అర్హుడు కాలేకపోయాడు. 40 ఏళ్ల అమిత్ భండారి దేశానికి 2000–2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. దాడిని మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, గౌతమ్ గంభీర్ తీవ్రంగా ఖండించారు. భండారిపై దాడికి పాల్పడిన అనూజ్ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
48 బంతుల్లోనే సెంచరీ
న్యూఢిల్లీ: యువ క్రికెటర్ రిషబ్ పంత్ భారత ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఈ ఢిల్లీ క్రికెటర్ జార్ఖండ్‌పై మెరుపు వేగంతో 48 బంతుల్లోనే శతకం బాదాడు. దీంతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 28 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టాడు. 1987-88 సీజన్లో జరిగిన ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాపై తమిళనాడు మాజీ ఓపెనర్ వీబీ చంద్రశేఖర్ 56 బంతుల్లోనే చేసిన సెంచరీయే ఇప్పటిదాకా రికార్డుగా కొనసాగింది. అంతకుముందు ఏడాది రాజేశ్ బోరా కూడా ఇన్నే బంతుల్లో శతకం సాధించాడు. అయితే ప్రపంచ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం 19 ఏళ్ల రిషబ్ పంత్ సాధించిన ఫీట్ రెండో స్థానంలో నిలుస్తుంది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ (1982)లో దక్షిణ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ హూక్స్ 34 బంతుల్లోనే ప్రత్యర్థి విక్టోరియాపై శతకం కొట్టి ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. కేరళలోని తుంబాలో జరిగిన రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్సలో పంత్ ఓవరాల్‌గా 67 బంతుల్లో 135 పరుగులు సాధించి అవుటయ్యాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, 13 సిక్సర్లున్నాయి. ముఖ్యంగా స్పిన్నర్లు షాబాజ్ నదీమ్, సన్నీ గుప్తా బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టాడు. దీంతో ఫాలో ఆన్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ చివరిదైన నాలుగో రోజు తమ రెండో ఇన్నింగ్సలో ఆరు వికెట్లకు 480 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్సలోనూ రిషబ్ 82 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఇక భీకర ఫామ్‌లో ఉన్న రిషబ్ ఈ సీజన్లో ఇప్పటికే ఏడు ఇన్నింగ్సలో వరుసగా 146, 308, 24, 9, 60, 117, 135 పరుగులతో జోరు మీదున్నాడు. అండర్-19 ప్రపంచకప్‌తో వెలుగులోకి.. గతేడాది అక్టోబర్‌లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్ ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. నమీబియాతో సెంచరీ చేసి జట్టును సెమీస్‌కు చేర్చాడు. ఆ మ్యాచ్ జరిగిన రోజే నిర్వహించిన ఐపీఎల్ వేలంలో రూ.10 లక్షల కనీస ధర ఉన్న పంత్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏకంగా రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లోనూ ఓ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత్ ‘ఎ’ జట్టులో చోటు దక్కకపోవడం రిషబ్‌ను నిరాశపరిచింది. అందుకే భారీగా పరుగులు సాధించి మరోసారి ఎవరూ తనను పక్కకు తప్పించేలా చేయకూడదని నిర్ణయించుకున్నట్టు గత నెలలో ట్రిపుల్ సెంచరీ చేసిన అనంతరం పంత్ తెలిపాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్ల (21)ను బాదిన తొలి భారత ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మున్రో (23) ముందున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భారత ఆటగాళ్ల ఫాస్టెస్ట్ సెంచరీలు ఆటగాడు ఎన్ని బంతుల్లో జట్టు ఎవరిపై సీజన్ రిషబ్ 48 ఢిల్లీ జార్ఖండ్ 2016-17 రాజేశ్ బోరా 56 అస్సాం త్రిపుర 1987-88 వీబీ చంద్రశేఖర్ 56 తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియా 1988-89 రూబెన్ పాల్ 60 తమిళనాడు గోవా 1995-96