IPL: విరాట్ కోహ్లి సహచరుడిపై పోలీసుల దాడి..! | Former RCB Player Vikas Tokas Accuses Delhi Police Of Assault | Sakshi
Sakshi News home page

IPL: మాస్క్ పెట్టుకోలేదని విరాట్ కోహ్లి సహచరుడిపై పోలీసుల దాడి..!

Published Sat, Jan 29 2022 7:37 PM | Last Updated on Sat, Jan 29 2022 7:37 PM

Former RCB Player Vikas Tokas Accuses Delhi Police Of Assault - Sakshi

Vikas Tokas: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఐపీఎల్‌ సహచరుడు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ ఆటగాడు వికాస్‌ తోకాస్‌పై ఢిల్లీ పోలీసులు దాడి చేశారని తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఈ నెల 26న ఢిల్లీ శివారులోని ఓ గ్రామం వద్ద వికాస్ తోకాస్‌ కారును సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారు. ఆ సమయంలో మాస్క్ ధరించకపోవడంతో రూ.2000 ఫైన్ కట్టాలని వారు వికాస్‌ను ఆదేశించారు. 


అయితే అతను ఫైన్ కట్టనని చెప్పడంతో చిర్రెత్తిపోయిన పోలీసులు అతన్ని కారులో నుంచి కిందకు లాగి ముఖంపై పిడిగద్దులు గుద్దారు. దీంతో అతని కంటి భాగంలో బలమైన గాయాలయ్యాయి. అయితే ఇక్కడ పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. వికాస్‌ రైఫిల్‌తో పారిపోతుండగా తాము పట్టుకున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. 


కాగా, వికాస్‌ పోలీసులపై చేసిన ఆరోపణలను సౌత్ వెస్ట్ డీసీపీ గౌరవ్ శర్మ ఖండించారు. తాను జాతీయ స్థాయి క్రికెటర్‌నని, తననే జరిమానా కట్టమంటావా అని వికాసే తమ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడాడంటూ ప్రత్యారోపణలు చేశాడు. అయితే, ఈ విషయంలో పోలీసులంతా కుమ్మక్కయ్యారని, ఉన్నతాధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలని వికాస్‌ విజ్ఞప్తి చేశాడు. 

ఇదిలా ఉంటే, 2016 ఐపీఎల్‌ వేలం సందర్భంగా వికాస్ తోకాస్‌ను ఆర్సీబీ 10 లక్షల బేస్‌ ప్రైజ్‌ చెల్లించి దక్కించుకుంది. అయితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అతనికి ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు. దీంతో ఆ తర్వాత సీజన్లలో అతను ఐపీఎల్‌లో కనిపించలేదు. వికాస్‌ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి  ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రైట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ మీడియం పేసర్‌ అయిన అతను 15 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 11 లిస్ట్‌ ఏ, 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 67 వికెట్లు 219 పరుగులు చేశాడు. 
చదవండి: IPL 2022: వేలంలో రికార్డు ధర పలికే భారత ఆటగాళ్లు ఆ ఇద్దరే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement