రంజీ ట్రోఫీ-2024 ఎలైట్ గ్రూపు-డిలో భాగంగా ఇండోర్ వేదికగా ఢిల్లీ, మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ ఆటగాడు శరాన్ష్ జైన్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. రెండో రోజు ఆట సందర్భంగా ఢిల్లీ మిడిలార్డర్ ఆటగాడు వైభవ్ కంద్‌పాల్‌ని శరాన్ష్ అద్భుతమైన రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 44 ఓవర్‌లో రెండో బంతిని వైభవ్ కంద్‌పాల్ బౌలర్ ఎండ్ వై డిఫెన్స్ ఆడాడు.
ఈ క్రమంలో బౌలర్ శరాన్ష్ జైన్ తన కుడివైపు మెరుపు వేగంతో డైవ్ చేస్తూ అద్భుతమైన రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. దీంతో శరాన్ష్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 205 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో యష్ ధుల్(47) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో కుమార్ కార్తికేయ, అర్యన్ పాండే తలా మూడు వికెట్లతో చెలరేగారు. అంతకుముందు మధ్యప్రదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఢిల్లీకి తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగుల అధిక్యం లభించింది.
చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్!
I.C.Y.M.I
— BCCI Domestic (@BCCIdomestic) January 20, 2024
How's that for a catch❓
Madhya Pradesh's Saransh Jain pulled off a superb caught and bowled to dismiss Delhi's Vaibhav Kandpal 👌👌
Relive the fantastic grab 🔽@IDFCFIRSTBank | #RanjiTrophy | #MPvDEL
Follow the match ▶️ https://t.co/gn30dZUkO4 pic.twitter.com/lTCP9qy7Gz
Comments
Please login to add a commentAdd a comment