
భారత్, ఆస్ట్రేలియా చివరి వన్డే సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లిని సన్మానించాలని భావించిన ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఇటీవల జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో డీడీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
ముగ్గురు ‘ఢిల్లీ దిగ్గజాలు’ కోహ్లి, సెహ్వాగ్, గంభీర్‌లను ఒకేసారి బుధవారం ఐదో వన్డేకు ముందు సత్కరించాలనేది డీడీసీఏ ఆలోచన. అయితే బీసీసీఐ కూడా ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని రద్దు చేసుకున్న కారణంగా తాము ఇలాంటి కార్యక్రమం తలపెట్టడం సముచితం కాదని భావించినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment