రంజీ ట్రోఫీ-2024 సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోనుంది.
పుదుచ్చేరి చారిత్రత్మక విజయంలో పేసర్ గౌరవ్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించిన గౌరవ్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 3 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 10 వికెట్లు పడగొట్టి గౌరవ్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 148 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్ త్యాగీ(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పుదుచ్చేరి తమ మొదటి ఇన్నింగ్స్‌ను 244 పరుగుల వద్ద ముగించి 96 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ అదే ఆటతీరును కొనసాగించింది.
రెండో ఇన్నింగ్స్‌లో సైతం కేవలం 145 పరుగుల చూపచుట్టేసింది. ఈ క్రమంలో 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పుదుచ్చేరి ముందు ఢిల్లీ ఉంచగల్గింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా కెప్టెన్ ధుల్ విఫలమయ్యాడు.
చదవండి: Pak Vs NZ: పాక్ క్రికెట్‌తో ప్రయాణం ముగిసిపోయింది.. ఇక సెలవు!
Comments
Please login to add a commentAdd a comment