రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ తొలి రెండు మ్యాచ్‌లకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు 20 ఏళ్ల యశ్ ధుల్ సారథ్యం వహించనున్నాడు. జట్టులో ఇషాంత్ శర్మ, నితీష్ రాణా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు మేనేజేమెంట్ యశ్ ధుల్‌కి సారథ్య బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం.
కాగా అతడి సారథ్యంలోనే యువ భారత జట్టు ఈ ఏడాది అండర్-19 ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకుంది. అతడి కెప్టెన్సీ నైపుణ్యాలు చూసి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక గత రంజీ సీజన్ లో ఢిల్లీ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన యశ్‌దుల్ అద్భుతంగా రాణించాడు.
ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 820 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 సెంచరీలు ఉన్నాయి. ఇక ఏడాది రంజీ సీజన్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్రతో తలపడనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి పుణే వేదికగా ప్రారంభం కానుంది.
ఢిల్లీ జట్టు: యశ్ ధుల్ (కెప్టెన్), హిమ్మత్ సింగ్ (వైస్ కెప్టెన్), ధ్రువ్ షోరే, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), వైభవ్ రావల్, లలిత్ యాదవ్,నితీష్ రాణా, ఆయుష్ బదోని, హృతిక్ షోకీన్, శివంక్ వశిష్త్, వికాస్ మిశ్రా, జాంటీ సిద్ధు, ఇషాంత్ శర్మ, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, సిమర్‌జీత్ సింగ్ లక్షయ్ థరేజా, ప్రన్షు విజయరన్
Comments
Please login to add a commentAdd a comment