‘భారత్‌లోను మమ్మల్ని ఆరాధిస్తారు’ | Pakistan cricketers are adored in India | Sakshi
Sakshi News home page

భారత్‌లోను మమ్మల్ని ఆరాధిస్తారు: పాక్‌ క్రికెటర్‌

Published Tue, Jan 23 2018 6:51 PM | Last Updated on Tue, Jan 23 2018 6:51 PM

Pakistan cricketers are adored in India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌-పాకిస్థాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటుంది. ఇక ఈ దాయాదీ దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే యాషెస్‌ సిరీస్‌ కన్నా ఎక్కువ ఉత్కంఠ. ఇరు దేశాల పోరులో రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ సంపాదించుకున్న క్రికెటర్లు ఉన్నారు. అదే కోవకు చెందిన పాక్‌ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ ఇదే విషయంపై స్పందించాడు. 

‘సరిహద్దుల సమస్యలతో ఇరు దేశాల క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌లో లభించే గొప్ప అనుభవాన్ని కోల్పోతున్నారు. యాషెస్‌ సిరీస్‌తో సమానంగా జరిగే గొప్ప సిరీస్‌కు దూరమవుతున్నారు. అంతేకాకుండా రాత్రికి రాత్రే హీరో అయ్యే అవకాశాలు కూడా ఇరు జట్ల ఆటగాళ్లు కోల్పోతున్నారు. భారత్‌లో పాక్‌ క్రికెటర్లను సైతం ఆరాధిస్తారు. ఇలా నేను భారత అభిమానుల ప్రేమను చాల అందుకున్నాను. మరో సారి పాక్‌ క్రికెటర్లు ఇలాంటి ప్రేమను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. దేశ రాజకీయాలతో క్రీడా సంబంధాలు దెబ్బతీనడం విచారకరమైన విషయం. ఇరు జట్ల క్రికెట్‌ బోర్డులు చొరువ తీసుకొని ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా కృషి చేయాలని’  అక్తర్‌ అభిప్రాయపడ్డారు.

1999 ఏషియన్‌ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో అప్పటి భారత ఆటగాళ్లైన రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌లను తన వేగమైన బంతులతో పెలిలియన్‌ చేర్చి రాత్రికి రాత్రే అక్తర్‌ హీరో అయ్యాడు. ఇక 2007 నుంచి భారత్‌-పాక్‌ మధ్య క్రీడా సంబందాలు దెబ్బతిన్నాయి. 2012లో ఓ చిన్న సిరీస్‌ మినహా  ఈ దాయదీ జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలబడ్డ విషయం తెలిసిందే.  ఉ‍గ్రవాద చర్యలు ఆపేంత వరకు పాక్‌ క్రీడా సంబందాలు ఉండయని భారత ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement