
టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్లనుఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్నాడని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడుతున్నాడు. అదే విధంగా స్పిన్నర్లకు, మీడియం పేస్ బౌలర్లకు అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడని అతడు తెలిపాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అయ్యర్.. ప్రస్తుతం దక్షిణాప్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో అంతగా రాణించ లేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 94 పరుగులు మాత్రమే చేశాడు.
"అయ్యర్ పేస్ బౌలింగ్‌కు ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఒక్క సిరీస్‌లోనే కాదు గత కొన్ని మ్యాచ్‌ల నుంచి కూడా ఫాస్ట్ బౌలర్లకే తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఐపీఎల్‌లో 140 కిమీ కంటే ఎక్కువ వేగంతో వచ్చే బంతుల్ల్ని ఆడిన సందర్భాల్లో అతడి స్ట్రైక్ రేట్ భారీగా తగ్గింది. అయితే అతడు స్పిన్నర్లు, 140 కిమీ కంటే తక్కువ వేగంతో వేసే బౌలర్లపై అతడు తేలిగ్గా ఆడుతాడు. అతడు తన భుజాలపైకి వచ్చే బంతులను ఎదర్కొవడంపై ప్రాక్టీస్ చేయాలి" అని ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
చదవండి: Former Cricketer Salil Ankola: దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని
Comments
Please login to add a commentAdd a comment