దక్షిణాఫ్రితో తొలి వన్డేలో విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా సఫారీలతో రెండో వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రోటీస్ గడ్డపై మరో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన వ్యూహాలు రచిస్తోంది. అయితే ఆఖరి రెండు మ్యాచ్‌లకు భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యాడు.
ప్రోటీస్‌తో టెస్టు సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు వన్డే సిరీస్‌ను నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో రెండో వన్డేలో పలు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ స్ధానంలో రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా వెటరన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు వినికిడి.
ఒక కుల్దీప్‌కు రెస్ట్ ఇస్తే.. యుజువేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. పేసర్ బర్గర్ స్ధానంలో లిజాడ్ విలియమ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
తుది జట్లు(అంచనా)
భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, లోకేష్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, విలియమ్స్, తబ్రైజ్ షమ్సీ
Comments
Please login to add a commentAdd a comment