
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దువ్వారపు శివకుమార్ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ బరిలోకి దిగిన అతనికి ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. సిద్ధాంతంకు చెందిన శివకుమార్ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. అతను 40 వన్డేలు, 16 టి20లు కూడా ఆడాడు.
కోహ్లి కెప్టెన్సీలో 2008లో అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడినా ఉన్నా...అతనికి మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. ఆఖరిసారిగా 2018లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన శివకుమార్ అమెరికాకు వలస వెళ్లాడు. కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధన పూర్తి చేసుకున్న అనంతరం ఇటీవలే 32 ఏళ్ల శివకుమార్‌కు టీమ్‌లో చోటు లభించింది.
చదవండి: IRE Vs NZ: కివీస్ కొంపముంచిన టవల్.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి!