Nathan Coulter-Nile
-
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు బిగ్‌షాక్
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమితో షాక్‌లో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నీల్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ యాజమాన్యం ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించింది. కాగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో కౌల్టర్ నీల్ ఆడాడు. ఆటలో చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రస్తుతం అతనికి రెస్ట్ అవసరమని వైద్యులు దృవీకరించారు. కౌల్టర్ నీల్ తాను కోలుకునే వరకు స్వదేశంలో రీహాబిటేషన్‌లో గడపనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్.. ''తొందరగా కోలుకో.. మనం మళ్లీ కలుద్దా ఎన్సీఎన్(నాథన్ కౌల్టర్ నీల్)'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా కౌల్టర్ నీల్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరని ఎంపిక చేస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కౌల్టర్ నీల్ 48 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్ మెగావేలంలో రాజస్తాన్ రూ. 2 కోట్లకు నాథన్ కౌల్టర్ నీల్‌ను దక్కించుకుంది. కౌల్టర్ నీల్ ఐపీఎల్లో 38 మ్యాచ్‌లాడి 48 వికెట్లు పడగొటగ్టాడు. ఐపీఎల్లో మధ్యలోనే వైదొలగడం కౌల్టర్ నీల్‌కు ఇది రెండోసారి. ఇంతకముందు 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక కండరాల గాయంతో 2021 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి పాలైంది. ఒక దశలో మ్యాచ్‌లో పట్టు చిక్కినప్పటికి.. దినేశ్ కార్తిక్ విధ్వంసానికి తోడూ.. షాబాజ్ అహ్మద్ నిలకడైన ఆటతీరుతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు' Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్ Until we meet again, NCN. 💗 Speedy recovery. 🤗#RoyalsFamily | #HallaBol | @coulta13 pic.twitter.com/XlcFUcTg5L — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2022 -
ఐపీఎల్ 2022: 8 మ్యాచ్‌ల హైలైట్స్
-
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్!
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముందు రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు పేసర్ నాథన్ కౌల్టర్‌నైల్ గాయం కారణంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌రైజెర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కాల్టర్నైల్ గాయపడ్డాడు. అయితే అతడు గాయం నుంచి ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన కౌల్టర్‌నైల్ ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే నాథన్ కౌల్టర్ నైల్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. ఒక వేళ అతడు దూరమైతే రాజస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కౌల్టర్ నైల్ ముంబైతో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో నవ్‌దీప్ సైనీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం(ఏప్రిల్2)న ముంబై ఇండియన్స్ తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, శుభమ్ గర్వాల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, తేజస్ బరోకా, అనునయ్ సింగ్, కెసి కరియప్ప, సంజు శాంసన్, జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, నాథన్ కౌల్టర్ నైల్, జిమ్మీ ఎం నీల్, జిమ్మీ ఎమ్. , కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్కాయ్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్. Hope it is not serious. pic.twitter.com/EOEkvQYUCQ — That-Cricket-Girl (@imswatib) March 29, 2022 -
'మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి!'
బిగ్‌బాష్ లీగ్ 2021లో శుక్రవారం మెల్బోర్న్ స్టార్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మెల్బోర్న స్టార్స్ బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ నాలుగో బంతిని హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ బెన్ మెక్‌డెర్మోట్ డీప్ బ్యాక్వర్డ్స్క్వేర్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. అయితే బంతి వెళ్లి స్డేడియం అవతల చాలా దూరంలో పడింది. దీంతో దెబ్బకు అంపైర్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..'' మా బంతి పోయింది.. ఒకవేళ కనిపిస్తే బ్లండ్స్స్టోన్ ఎరీనాకు తెచ్చివ్వండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 24 పరుగుల తేడాతో మెల్బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్‌కు ఓపెనర్లు బెక్ డెర్మోట్(67 పరుగులు), మాధ్యూ వేడ్(39 పరుగులు) తొలి వికెట్‌కు 93 పరుగుల జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ తలా ఒక చెయ్యి వేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జో క్లార్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జో బర్న్స్ 22, హిల్టన్ కార్ట్‌రైట్ 26 పరుగులు చేశారు. Lost ball: if found, please return to @BlundstoneArena 💥#BBL11 pic.twitter.com/Pvo3rzCp7t — KFC Big Bash League (@BBL) December 24, 2021 -
‘నాకైతే ఇంటి కంటే బయోబబుల్ సేఫ్’
చెన్నై: తాను స్వదేశం వెళ్లడం కంటే ఇక్కడ ఐపీఎల్ బయోబబుల్ వాతావరణమే సేఫ్ అనిపిస్తోందని ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ పేర్కొన్నాడు. ఇప్పటికే ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్‌లు బయోబబుల్ వాతావరణాన్ని తట్టుiకోలేక స్వదేశానికి వెళ్లిపోవడానికి సన్నద్దమైన తరుణంలో కౌల్టర్‌నైల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ డాట్ కమ్ ఏయూతో మాట్లాడిన కౌల్టర్‌నైల్...‘ ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రాయాలుంటాయి. వారికుండే పరిస్థితుల్ని బట్టే వారి నిర్ణయాలు ఉంటాయి. ఆడమ్ జంపా తిరిగి స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్దపడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆపై రిచర్డ్సన్ ఈ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. వారితో మాట్లాడితే విషయం అర్థమవుతుంది. నేను జంపాతో మాట్లాడాను. వెళ్లాల్సిన పరిస్థితుల్లో తప్పక వెళ్లాల్సి వస్తుందన్నాడు. జంపా, రిచర్డ్సన్ నిర్ణయాలను గౌరవిస్తున్నా. నాకైతే బయోబబుల్ వాతావరణం బాగుంది. ఇంటికి వెళ్లాలనే ప్రయత్నం చేయడం, ఇంటికి వెళ్లడం కంటే ఇక్కడే సేఫ్ అనిపిస్తోంది’ అని తెలిపాడు.ఈ సీజన్లో కౌల్టర్‌నైల్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంంబై ఇండియన్స్ పేస్ విభాగంగా బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నేలతో బలంగా ఉండటంతో కౌల్టర్‌నైల్ ఇంకా ఆడే అవకాశం రాలేదు. -
ఐపీఎల్‌కు కరోనా ఎసరు.. గుడ్‌బై చెబుతున్న ఆటగాళ్లు!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించిన బీసీసీఐ ఈసారి మాత్రం భారత్‌లోనే టోర్నీని నిర్వహిస్తోంది. బయో బబుల్ నిబంధనల నడుమ ఈ మెగా ఈవెంట్ కొనసాగుతోంది. అయితే, గత నాలుగు రోజులుగా భారత్‌లో కరోనా రోజూవారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదవుతున్న వేళ కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పి స్వదేశానికి పయనమవుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆండ్రూ టై(రాజస్తాన్ రాయల్స్), ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆడం జంపా, కేన్ రిచర్డ్సన్ ఇంటిబాటపట్టారు. Courtesy: IPL Twitter ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్-2021 ఆడుతున్న తమ క్రికెటర్లు, కోచ్‌లు, కామెకంటేటర్లతో టచ్‌లో ఉన్నామని, ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపింది. భారత్‌లో కరోనా వ్యాప్తి ఉధృతమవుతోందని, ఇలాంటి కష్ట సమయంలో కచ్చితంగా తాము భారతీయులకు మద్దతుగా నిలబడతామని, అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచనల మేరకు తమ క్రికెటర్లను వెనక్కి పిలిపించే అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు.. ‘‘బయో సెక్యూరిటీ ప్రొటోకాల్స్ నడుమ ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్‌లు, కామెంటేటర్లతో క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ కాంటాక్ట్‌లో ఉంటోంది. భారత్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. భారత్‌కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది’’అని ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్వెల్, నాథన్ కౌల్టర్ నైల్ తదితర 14 మంది ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోగా, మిగతా క్రికెటర్లు కూడా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే తీవ్ర ప్రభావం పడటం ఖాయం. ఇక ఈ విషయంపై స్పందించిన కౌల్టర్ నైల్ మాట్లాడుతూ... ‘‘ప్రతి ఒక్కరి మనఃస్థితి, అభిప్రాయాలు వేర్వేరుగా ఉంటాయి. ఆండ్రూ ఇంటికి వెళ్లడం నాకు ఆశ్చర్యం కలిగించింది. జంప్స్, రిచో కూడా వెళ్లిపోయారు. నేను జంప్స్‌తో మాట్లాడాను. స్వదేశానికి వెళ్లడం వెనుక గల కారణాలపై తన వాదన విన్నాను. నాకు మాత్రం బయోబబుల్‌లో ఉండటమే సురక్షితంగా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక చేతి వేలి గాయం కారణంగా రాజస్తాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ ఆటగాడు బెన్‌స్టోక్స్, మరో క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. చదవండి: బెయిస్టో అప్పుడు టాయిలెట్లో ఉంటే తప్ప -
తడబడి నిలబడిన ఆసీస్
నాటింగ్‌హామ్ : ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ బ్యాటింగ్‌లో రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ ఆటగాళ్లలో కౌల్టర్ నైల్(92; 60 బంతుల్లో 8ఫోర్లు, 4 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(73; 103 బంతుల్లో 7ఫోర్లు), కేరీ(45) మినహా అందరూ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. కరేబియన్ బౌలర్లలో బ్రాత్‌వైట్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. థామస్, కాట్రెల్, రసెల్‌లు తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. స్థానిక ట్రెంట్‌బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని చాటుతూ.. ఆరంభం నుంచి ఆ జట్టు బౌలర్లు చెలరేగిపోయారు. పదునైన విండీస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి ఫించ్(6)తో సహా వార్నర్(3), ఖవాజా(13), మ్యాక్స్‌వెల్(0), స్టొయినిస్(19)లు పూర్తిగా విఫలమవ్వడంతో 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్మిత్ రాణించగా.. కౌల్టర్ నైల్ రెచ్చిపోగా ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు స్టీవ్ స్మిత్. ఆరో వికెట్‌కు అలెక్స్ కేరీ(45)తో కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. కేరీ ఔటైన అనంతరం కౌల్టర్ నైల్ క్రీజులోకి రావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కౌల్టర్ నైల్.. విండీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. కౌల్టర్ నైల్ ఊపు చూసి గేర్ మార్చిన స్మిత్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పెంచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అనంరతం స్మిత్‌ను ఔట్ చేసి ఈ జోడిని థామస్ విడదీస్తాడు. ఇక సెంచరీ దిశగా సాగుతున్న కౌల్టర్ నైల్ పయనం 92 పరుగుల వద్దే ముగుస్తుంది. -
కోహ్లి జట్టులోకి కోరె అండర్సన్
బెంగళూరు : గాయంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్‌ను తీసుకున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రకటించింది. విరాట్ కోహ్లి సారథ్యం వహిస్తున్న బెంగళూరు వేలంలో నాథన్ కౌల్టర్ నీల్‌ను రూ.2.20 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కౌల్టర్ నీల్ అద్బుతంగా రాణించాడు. కేవలం 8 మ్యాచ్‌లే ఆడిన నీల్ 15 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే ఐపీఎల్ ఆరంభం ముందే గాయపడ్డ అతనికి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆర్సీబీ నీల్ స్థానంలో కివీస్ ఆల్‌రౌండర్ కోరే అండర్సన్‌ను కనీస ధర రూ.2 కోట్లకు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అండర్సన్లో అపార ప్రతిభ ఉందని, అతడు చాలా విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్ అని, జట్టులోకి స్వాగతం పలుకుతున్నామని ఆర్సీబీ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ పేర్కొన్నాడు. ఆర్సీబీ ఏప్రిల్ 8న కోల్‌కతాతో తొలి మ్యాచ్ ఆడనుంది. -
ప్రతిసారీ గెలవాలనే ఆడతాం: నిలె
చెన్నై: ఐపీఎల్-8 టైటిల్ నెగ్గాలంటే తమ జట్టు మరింత మెరుగుపడాల్సిన అవసరముందని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె పేర్కొన్నాడు. గతేడాది పోల్చుకుంటే తమ టీమ్ మెరుగ్గా ఉందని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో గురువారం జరిగిన తన తొలి మ్యాచ్ లో డేర్ డెవిల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి నిరుత్సాహానికి గురిచేసిందని కౌల్టర్-నిలె అన్నాడు. ప్రతిసారీ విజయం సాధించాలనే బరిలోకి దిగుతామని, కానీ బాగా ఆడిన జట్టే గెలుస్తుందన్నాడు. గతేడాది విఫలమైనప్పటికీ కౌల్టర్-నిలెను ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనసాగిస్తోంది. విజయాలే క్రికెట్ ప్రమాణికమని పేర్కొన్నాడు. విజయవంతం కాకపోతే జట్టు నుంచి తప్పిస్తారని వ్యాఖ్యానించాడు. తమ టీమ్ లో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయని వాటిని సరిదిద్దుకుని పుంజుకుంటామన్న దీమా వ్యక్తం చేశాడు. -
ఐపీఎల్లో పాకిస్థాన్ సంతతి స్పిన్నర్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ సంతతికి చెందిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడనున్నాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున అతడు బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీ తరపున ఆడుతున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె గాయపడడంతో అతడి స్థానంలో తాహిర్‌ను తీసుకున్నారు. దీనికి ఐపీఎల్ సాంకేతిక సంఘం ఆమోదముద్ర వేసింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో తాహిర్ ఆడనున్నాడు. ఏప్రిల్ 21న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ గాయపడ్డాడు. జహీర్‌ఖాన్, సౌరవ్ తివారి కూడా గాయాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు.