
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ముందు రాజస్తాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు పేసర్ నాథన్ కౌల్టర్‌నైల్ గాయం కారణంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్‌రైజెర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాథన్ కాల్టర్‌నైల్ గాయపడ్డాడు. అయితే అతడు గాయం నుంచి ఇంకా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన కౌల్టర్‌నైల్ ఏకంగా 48 పరుగులు సమర్పించుకున్నాడు.
అయితే నాథన్ కౌల్టర్ నైల్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. ఒక వేళ అతడు దూరమైతే రాజస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. కౌల్టర్ నైల్ ముంబైతో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే అతడి స్థానంలో నవ్‌దీప్ సైనీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం(ఏప్రిల్2)న ముంబై ఇండియన్స్ తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది.
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, శుభమ్ గర్వాల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, తేజస్ బరోకా, అనునయ్ సింగ్, కెసి కరియప్ప, సంజు శాంసన్, జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డుసెన్, నాథన్ కౌల్టర్ నైల్, జిమ్మీ ఎం నీల్, జిమ్మీ ఎమ్. , కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.
Hope it is not serious. pic.twitter.com/EOEkvQYUCQ
— That-Cricket-Girl (@imswatib) March 29, 2022
Comments
Please login to add a commentAdd a comment