Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం రాత్రి ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు రాణించడంతో సీజన్‌లో ముంబై తొలిసారి బోణీ కొట్టింది. కాగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చహల్ వేశాడు. ఆ ఓవర్ చివరి బంతిని సూర్యకుమార్ స్వీప్‌షాట్ ఆడే ప్రయత్నం చేయగా మిస్ అయింది.
దీంతో బంతి సూర్య ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. చహల్ ఔట్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో చహల్ డీఆర్‌ఎస్ కోరాడు. అయితే రిప్లేలోనూ బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్‌స్టంప్ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో థర్డ్అంపైర్ కూడా నాటౌట్ ప్రకటించాడు. థర్డ అంపైర్ నిర్ణయంతో షాక్ తిన్న చహల్ నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ వచ్చి చహల్‌కు హగ్ ఇచ్చి ''పోనీలే.. మరోసారి ట్రై చెయ్'' అంటూ ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Gill No Ball Contoversy : గిల్ ఔట్‌పై అప్పీల్.. నో బాల్ ఇవ్వడం వెనుక అసలు కథ!
IPL 2022: రోహిత్ విఫలం.. రితికాను ఓదార్చిన అశ్విన్ భార్య
— Patidarfan (@patidarfan) April 30, 2022
Comments
Please login to add a commentAdd a comment