PC: IPL Twitter
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాపిటల్స్ 8 వికెట్లతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే వార్నర్ అదృష్టం రాజస్తాన్ రాయల్స్ కొంపముంచినట్లయింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 9వ ఓవర్ యజ్వేంద్ర చహల్ వేశాడు. చహల్ వేసిన బంతి వార్నర్ బ్యాట్‌ను దాటి ఆఫ్‌స్టంప్‌ను తాకుతూ వెళ్లిపోయింది. వికెట్ దక్కిందనుకున్న చహల్ ఆనందం అంతలోనే ఆవిరైంది.
PC: IPL Twitter
బంతి నెమ్మదిగా తాకడంతో లైట్స్ వెలిగినా... బెయిల్ మాత్రం పడలేదు. దాంతో వార్నర్ నాటౌట్‌గా తేలాడు. ఒకవేళ ఆ బెయిల్ కిందపడి వార్నర్ ఔట్ అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికి వార్నర్ 22 పరుగులు మాత్రమే చేశాడు. మార్ష్ దాటిగా ఆడుతున్నప్పటికి.. మంచి భాగస్వామ్యం ఏర్పడిన దశలో వార్నర్ ఔట్ అయ్యుంటే రాజస్తాన్‌కు కలిసొచ్చేదే. కానీ విజయం ఢిల్లీకే రాసిపెట్టినట్లుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. అశ్విన్ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, దేవదత్ పడిక్కల్ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 89; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
వార్నర్ వీడియో కోసం క్లిక్ చేయండి
చదవండి: IPL 2022: సీఎస్‌కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్‌ఆర్‌హెచ్ బాటలోనేనా!
Comments
Please login to add a commentAdd a comment