Suryakumar Yadav Ruled Out Of IPL 2022 Due To Muscle Injury - Sakshi
Sakshi News home page

Surya Kumar Yadav: 'ఈ సీజన్‌ మాకు కలిసిరాలేదు'.. సూర్యకుమార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Tue, May 10 2022 10:25 AM | Last Updated on Tue, May 10 2022 12:06 PM

Surya Kumar Yadav Emotional Post After Ruled Out IPL 2022 Muscle Injury - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏది కలిసిరావడం లేదు. ఘోర ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ రూపంలో బిగ్‌షాక్‌ తగిలింది. మోచేతి గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్లేఆఫ్‌కు దూరమైనప్పటికి విజయాలతో టోర్నీని ముగించాలని ముంబై భావించింది. అయితే సూర్యకుమార్‌ లేని లోటు కేకేఆర్‌తో మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.

113 పరుగులకే కుప్పకూలిన ముంబై సీజన్‌లో తొమ్మిదో పరాజయాన్ని మూటగట్టుకుంది.11 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. కాగా సీజన్లో ముంబై ఇండియన్స్‌ తరపున టాప్‌ స్కోరర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. 8 మ్యాచ్‌లాడిన సూర్య 43.29 సగటుతో​ 303 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ సాధించిన రెండు విజయాల్లో ఒకటి సూర్య కుమార్‌ చలువతోనే వచ్చింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూర్య 39 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. 

తాజాగా గాయంతో ఐపీఎల్‌ 2022కు దూరమైన సూర్యకుమార్‌ యాదవ్‌ అభిమానులనుద్దేశించి ట్విటర్‌ వేదికగా భావోద్వేగా పోస్టు షేర్‌ చేశాడు.''మీ ఆశీస్సులు, అభిమానం.. సహకారంతో తొందరలోనే తిరిగి వస్తాను. అయితే ముంబై ఇండియన్స్‌ తరపున మాత్రం మళ్లీ వచ్చే సీజన్లోనే కనిపిస్తానేమో. ఇక ముంబై ఇండియన్స్‌ ఫ్యామిలీని మిస్సవుతున్నా. ఈ సీజన్‌లో మనకు ఏది కలిసిరావడం లేదు. ఎలాగూ ప్లే ఆఫ్‌ అవకాశాలు లేవు.. మిగతా మ్యాచ్‌లను గెలిచి విజయంతో సీజన్‌ను ముగించే ప్రయత్నం చేయండి.. మిస్‌ యూ ముంబై ఇండియన్స్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా సూర్యకుమార్‌ ఆరంభంలో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే.

చదవండి: Venkatesh Iyer: 'అప్పటివరకు బాగానే.. ఇషాన్‌ చెప్పగానే ఔటయ్యాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement