
PC. IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా శనివారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అయితే 35వ పుట్టినరోజు జరుపుకున్న రోహిత్ తాను స్కోర్ చేయడంలో ఫెయిల్ అయినప్పటికి.. జట్టు మాత్రం రాణించి రోహిత్‌కు బర్త్‌డే కానుకగా సీజన్‌లో తొలి విజయాన్ని అందించింది. బర్త్‌డే రోజున రోహిత్ రాణిస్తాడనుకుంటే అతనికి నిరాశే ఎదురైంది. 2 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
దీంతో డగౌట్‌లో కూర్చున్న రోహిత్ భార్య రితికా శర్మ చాలా ఫీలయ్యింది. దాదాపు ఏడ్చినంత పని చేసింది. రోహిత్ శర్మ వికెట్ తీశానన్న ఆనందంతో అశ్విన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసిన అశ్విన్ భార్య ప్రీతి కూడా చప్పట్లు కొడుతూ అభినందించింది. అయితే పక్కనే రితికా బాధపడడం చూసి పరిస్థితి అర్థం చేసుకున్న అశ్విన్ భార్య ఆమె దగ్గరకు వచ్చి ఓదార్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (52 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. అనంతరం ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ (39 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, తిలక్ వర్మ (30 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. సూర్య, తిలక్ మూడో వికెట్‌కు 56 బంతుల్లో 81 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. చివర్లో టిమ్ డేవిడ్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) జట్టును విజయతీరానికి చేర్చాడు.
చదవండి: MI Vs RR: ముంబై ఎట్టకేలకు భోణీ .. రోహిత్‌కు బర్త్‌డే కానుక
Com'on ASh 😍 pic.twitter.com/3k7hyS3XsJ
— Krishna Tiwari (@krishnaa_ti) April 30, 2022
Comments
Please login to add a commentAdd a comment