ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 2) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుండగా, పూణేలోని ఎంసీఏ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో పోటీపడుతున్న ముంబై, ఆర్‌ఆర్ జట్లు ప్రస్తుత సీజన్‌లో చెరో మ్యాచ్ ఆడగా, ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం, రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేశాయి.
ఈ మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌పై గెలిచి ఐపీఎల్ 2022 సీజన్‌లో బోణీ కొట్టాలని రోహిత్ సేన భావిస్తుండగా, సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ లీగ్‌లో రెండో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఎస్‌ఆర్‌హెచ్‌పై 210 పరుగుల భారీ స్కోర్ చేసి, ప్రత్యర్ధిని 149 పరుగులకే కట్టడి చేసిన రాజస్థాన్ ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేకపోగా.. ముంబై మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (అన్మోల్‌ప్రీత్ సింగ్ స్థానంలో) పునరాగమనం చేయడం పక్కా కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో దారాళంగా పరుగులు సమర్పించుకున్న డేనియల్ సామ్స్‌ను పక్కకు పెట్టి అతని ప్లేస్ మరో విదేశీ బౌలర్‌కు (ఫేబియన్ అలెన్) ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్‌లు జరగ్గా 13 మ్యాచ్‌ల్లో ముంబై, 11 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలుపొందాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తుది జట్లు (అంచనా):
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్ నైల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, మురుగన్ అశ్విన్, టైమాల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి, ఫేబియన్ అలెన్
చదవండి: ఎస్‌ఆర్‌హెచ్ నిరసన గళం.. బీసీసీఐ వద్దకు చేరిన కేన్ మామ పంచాయతీ..!
Comments
Please login to add a commentAdd a comment