Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో డివై పాటిల్ స్టేడియం వేదికగా శనివారం(ఏప్రిల్ 30) రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో రాజస్తాన్ అద్భుతంగా రాణిస్తుండగా.. ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింట్లోనూ ఓటమి చెందింది.
ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి.. ఈ ఏడాది సీజన్‌లో బోణి కొట్టాలని భావిస్తోంది. పస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఘోరంగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్‌లో లేకపోవడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో ముంబై బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక రాజస్తాన్ రాయల్స్ విషయానికి వస్తే.. ఈ ఏడాది సీజన్‌లో వరుస విజయాలతో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్.. 6 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా రాజస్తాన్ రాయల్స్ పటిష్టంగా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి తమ విజయాల పరంపరను కొనసాగించాలని భావిస్తోంది.
ఇక ఇరు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లు ముఖాముఖి 28 మ్యాచ్ల్లో తలపడగా.. రాజస్తాన్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 14 మ్యాచ్‌ల్లో ముంబై గెలిపొందింది. మిగిలన ఒక్క మ్యాచ్‌ల్లో ఎటువంటి ఫలితం తేలలేదు.
తుది జట్లు అంచనా
రాజస్థాన్ రాయల్స్
జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
ముంబై ఇండియన్స్
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్, రిలే మెరెడిత్, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: Rohit-Kohli: 'ఇద్దరు చెత్తగా ఆడుతున్నారు.. ఈరోజైనా కనికరిస్తారా!
Comments
Please login to add a commentAdd a comment