ముంబై ఇండియన్స్ సారథి, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా శనివారం (ఏప్రిల్ 2) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 64 పరుగులు సాధిస్తే టీ20ల్లో 10000 పరుగుల మార్కును అందుకుంటాడు. గతంలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లి, ఓవరాల్‌గా మరో ఐదుగురు మాత్రమే ఈ అరుదైన మైలురాయిని అధిగమించగలిగారు.
విండీస్ విధ్వంసకర యోధుడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 463 మ్యాచ్‌ల్లో 14562 పరుగులతో టీ20ల్లో టాప్ రన్ స్కోరర్‌గా చలామణి అవుతుండగా, పాక్ వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ (472 మ్యాచ్‌ల్లో 11698 పరుగులు), విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పోలార్డ్ (582 మ్యాచ్‌ల్లో 11430 పరుగులు), ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ (347 మ్యాచుల్లో 10444 పరుగులు), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (328 మ్యాచుల్లో 10326 పరుగులు), ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (10308 పరుగులు) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ మరో 64 పరుగులు చేస్తే, టీ20ల్లో 10000 పరుగులు చేసిన ఏడో బ్యాటర్‌గా, అలాగే ఈ మార్కును అతి తక్కువ మ్యాచ్‌ల్లో (370) చేరుకున్న ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 370 మ్యాచ్‌ల్లో 9936 పరుగులు ఉన్నాయి. గేల్, కోహ్లి, వార్నర్, ఫించ్‌లు రోహిత్ కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న వారిలో ఉన్నారు. కాగా, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుడిగా (3313), అలాగే ఐపీఎల్‌లో మూడో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా (5652) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 2) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టనుండగా, పూణేలోని ఎంసీఏ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లో పోటీపడుతున్న ముంబై, ఆర్‌ఆర్ జట్లు ప్రస్తుత సీజన్‌లో చెరో మ్యాచ్ ఆడగా, ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం, రాజస్థాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయం నమోదు చేశాయి.
చదవండి: IPL 2022: ముంబై, రాజస్థాన్ మధ్య రసవత్తర పోరు.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?
Comments
Please login to add a commentAdd a comment