ప్రతిసారీ గెలవాలనే ఆడతాం: నిలె | Delhi Daredevils have more depth now, sasys Coulter-Nile | Sakshi
Sakshi News home page

ప్రతిసారీ గెలవాలనే ఆడతాం: నిలె

Published Fri, Apr 10 2015 7:17 PM | Last Updated on Sun, Sep 3 2017 12:07 AM

ప్రతిసారీ గెలవాలనే ఆడతాం: నిలె

ప్రతిసారీ గెలవాలనే ఆడతాం: నిలె

చెన్నై: ఐపీఎల్-8 టైటిల్ నెగ్గాలంటే తమ జట్టు మరింత మెరుగుపడాల్సిన అవసరముందని ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్-నిలె పేర్కొన్నాడు. గతేడాది పోల్చుకుంటే తమ టీమ్ మెరుగ్గా ఉందని తెలిపాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో గురువారం జరిగిన తన తొలి మ్యాచ్ లో డేర్ డెవిల్స్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

ఈ ఓటమి నిరుత్సాహానికి గురిచేసిందని కౌల్టర్-నిలె అన్నాడు. ప్రతిసారీ విజయం సాధించాలనే బరిలోకి దిగుతామని, కానీ బాగా ఆడిన జట్టే గెలుస్తుందన్నాడు. గతేడాది విఫలమైనప్పటికీ కౌల్టర్-నిలెను ఢిల్లీ డేర్ డెవిల్స్ కొనసాగిస్తోంది. విజయాలే క్రికెట్ ప్రమాణికమని పేర్కొన్నాడు. విజయవంతం కాకపోతే జట్టు నుంచి తప్పిస్తారని వ్యాఖ్యానించాడు. తమ టీమ్ లో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయని వాటిని సరిదిద్దుకుని పుంజుకుంటామన్న దీమా వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement