
కోరె అండర్సన్
బెంగళూరు : గాయంతో ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ స్థానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్‌ను తీసుకున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రకటించింది. విరాట్ కోహ్లి సారథ్యం వహిస్తున్న బెంగళూరు వేలంలో నాథన్ కౌల్టర్ నీల్‌ను రూ.2.20 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కౌల్టర్ నీల్ అద్బుతంగా రాణించాడు. కేవలం 8 మ్యాచ్‌లే ఆడిన నీల్ 15 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.
అయితే ఐపీఎల్ ఆరంభం ముందే గాయపడ్డ అతనికి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆర్సీబీ నీల్ స్థానంలో కివీస్ ఆల్‌రౌండర్ కోరే అండర్సన్‌ను కనీస ధర రూ.2 కోట్లకు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అండర్సన్‌లో అపార ప్రతిభ ఉందని, అతడు చాలా విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్ అని, జట్టులోకి స్వాగతం పలుకుతున్నామని ఆర్‌సీబీ హెడ్ కోచ్ డానియల్ వెటోరీ పేర్కొన్నాడు. ఆర్‌సీబీ ఏప్రిల్ 8న కోల్‌కతాతో తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment