దక్షిణాప్రికా క్రికెటర్‌ను అవమానించిన పాక్
బర్మింగ్‌హమ్: దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ ఇమ్రాన్ తాహీర్‌కు పాక్ కాన్సులేట్ అధికారులు చుక్కలు చూపించారు. లాహోర్ వేదికగా వరల్డ్ ఎలెవన్, పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్11 నుంచి టీ20 సిరీస్ జరగుతున్న విషయం తెలిసిందే. వరల్డ్ ఎలెవన్ జట్టులో సభ్యుడైన తాహీర్ పాక్ వీసా కోసం బర్మింగ్‌హమ్ కాన్సులేట్‌ను సంప్రదించగా అధికారులు వీసా ఇవ్వకుండా అవమానించారు. ఈ విషయాన్ని తాహీర్ ట్విట్టర్ వేదికగా ‘వరల్డ్‌ఎలెవన్ జట్టు సభ్యుడిగా పాక్ వెళ్లేందుకు వీసా కోసం వెళ్తే నన్ను నాకుటుంబాన్ని ఈరోజు పాక్ హైకమిషన్ అవమానపరించిందని’ ఓ మెసేజ్ ఫోటోకు క్యాప్షన్‌గా ట్వీట్ చేశారు.
ఆమెసేజ్ ఏమిటంటే..
‘నేను ఈ రోజు బర్మింగ్‌హమ్ పాక్ కాన్సులేట్‌లో విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను. పాక్ వీసా కోసం నా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్లాను. కాన్సులేట్ అధికారులను నన్ను నాకుటుంబ సభ్యులను 5 గంటలు వేచి ఉంచి, ఆఫీస్ సమయం అయిపోయిందంటూ వీసాలు జారీ చేయకుండా అవమానించారు. చివరకు కాన్సులేట్ హై కమిషనర్ ఐబీఎన్ ఈ అబ్బాస్ సూచనలతో నాకు వీసా జారీచేశారు. కమిషనర్ నాగురించి పాకిస్థాన్ సంతతికి చెందిన ఇరానీ, దక్షిణాఫ్రికా క్రికెటర్, వరల్డ్ ఎలెవన్ జట్టు సభ్యుడైన ఇతని పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తిస్తారా అని అధికారులపై మండిపడ్డారు. నన్ను రక్షించిన అబ్బాస్ గారికి హ్యాట్సాఫ్ అని’ తాహీర్ పేర్కొన్నారు.