legends league cricket 2022: లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మహారాజాస్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి జెయింట్స్ ఛేదించింది. వరల్డ్ జెయింట్స్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒకనొక సమయంలో 130 పరుగులకే 6 వికెట్ల కోల్పోయిన జెయింట్స్‌కు ఓటమి తప్పదు అని అంతా భావించారు. కానీ తాహిర్ తన తుపాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అంతే కాకుండా మహారాజాస్ చెత్త ఫీల్డింగ్ కూడా ఓటమికు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాజాస్ ఆదిలోనే సుబ్రమణియన్ బద్రీనాథ్, వసీం జాఫర్ వికెట్లను కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ నమన్ ఓజా చేలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 69 బంతుల్లో 140 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. అతడికి తోడు కెప్టెన్ కైఫ్(53) బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది.
చదవండి: సంచలనం సృష్టించిన రాజ్ బావా.. ధావన్ రికార్డు బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment