Naman Ojha
-
RSWS 2022: శ్రీలంకను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడిన ఇండియా లెజెండ్స్
Road Safety World Series 2022 Winner: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022 ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. శ్రీలంక లెజెండ్స్‌ను 33 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని ముద్దాడింది. నమన్ ఓజా అద్భుత సెంచరీ(71 బంతుల్లో 108 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు, నాటౌట్)తో జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఈ టైటిల్ గెలవడం వరుసగా ఇది రెండోసారి. సచిన్ మెరుపులు చూద్దామనుకుంటే! ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ వేదికగా శనివారం జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో టాస్ గెలిచిన ఇండియా లెజెండ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ వికెట్ కీపర్ బ్యాటర్ నమన్ ఓజా శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ సచిన్ టెండుల్కర్ మెరుపులు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కులశేఖర బౌలింగ్‌లో సచిన్ గోల్డెన్ డకౌగా వెనుదిరిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ సురేశ్ రైనా (4 పరుగులు) సైతం విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వినయ్ కుమార్ 36 పరుగులతో రాణించగా.. మిగిలిన వాళ్లలో యువరాజ్ సింగ్ 19, ఇర్ఫాన్ పఠాన్ 11 పరుగులు చేశారు. అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా నమన్ ఓజా ఆఖరి వరకు పట్టుదలగా నిలబడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లంక బౌలర్లలో కులశేఖరకు మూడు, ఇసురు ఉడానాకు రెండు వికెట్లు, ఇషాన్ జయరత్నేకు ఒక వికెట్ దక్కాయి. ఆదిలోనే షాక్.. ఆపై భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్ ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజేశ్ పవార్ బౌలింగ్‌లో దిల్షాన్ మునవీర 8 పరుగులు, వినయ్‌కుమార్ బౌలింగ్‌లో సనత్ జయసూర్య 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్(11 పరుగులు) సహా ఉపుల్ తరంగ(10) సైతం నిరాశపరిచాడు. ఈ క్రమంలో అసీల గుణరత్నె(19), జీవన్ మెండిస్(20) కాసేపు పోరాడగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ జయరత్నె అర్ధ శతకం(22 బంతుల్లో 51 పరుగులు)తో చెలరేగి లంక శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే, వినయ్ కుమార్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత మహేల ఉదవటె(19 బంతుల్లో 26 పరుగులు) జట్టు స్కోరును పెంచే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. టాపార్డర్ వైఫల్యం కారణంగా శ్రీలంక లెజెండ్స్ 18.5 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో వరుసగా రెండోసారి ట్రోఫీ ఇండియా లెజెండ్స్ కైవసమైంది. మాజీ క్రికెటర్ల లీగ్.. ఉద్దేశమేమిటంటే.. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు గతేడాది నుంచి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరిట ఇంటర్నేషనల్ టీ20 లీగ్ నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు ఇందులో భాగమయ్యారు. మొదట్లో ఇండియా, ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే ఉండగా.. ఈ ఏడాది న్యూజిలాండ్ లెజెండ్స్ సైతం చేరింది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సహకారంతో భారత రోడ్డు రవాణ, హైవేలు, ఐటీ మంత్రిత్వ శాఖ, యువజన క్రీడా శాఖ కలిసి ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నాయి. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ National Games 2022: ఇద్దరూ ఒకప్పుడు టీమిండియా కెప్టెన్లే! ప్రేమా..పెళ్లి.. కవలలు.. మూడేళ్ల తర్వాత.. -
సెంచరీతో చెలరేగిన నమన్ ఓజా.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ నమన్ ఓజా సెంచరీతో (71 బంతుల్లో 108 నాటౌట్, 15 ఫోర్లు, 2 సిక్సర్లు)చెలరేగాడు. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సెమీఫైనల్లో సెంచరీకి 10 పరుగుల దూరంలో ఆగిపోయిన నమన్ ఓజా.. ఈసారి మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోలేదు. ఆరంభంలోనే సచిన్ టెండూల్కర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికి.. సురేశ్ రైనా 4 పరుగులు చేసి ఔటైనప్పటికి.. ఒక ఎండ్‌లో మత్రం నమన్ ఓజా ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. నమన్ ఓజాకు జతగా వినయ్‌కుమార్(21 బంతుల్లో 36 పరుగులు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. వినయ్ కుమార్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ నమన్ ఓజా 68 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేయడంలో నమన్ ఓజా కీలకపాత్ర పోషించాడు. లంక లెజెండ్స్ బౌలర్లలో నువాన్ కులశేఖర మూడు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా రెండు వికెట్లు, ఇషాన్ జయరత్నే ఒక వికెట్ తీసుకున్నాడు. Naman Ojha smashed 108* runs from 71 balls including 15 fours and 2 sixes in the Road Safety World Series final 2022, a terrific knock to remember. pic.twitter.com/F4gNjjgNyf — Johns. (@CricCrazyJohns) October 1, 2022 చదవండి: థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం -
చెలరేగిన నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్ నమన్ ఓజా (90 పరుగులు నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో ఇర్ఫాన్ పఠాన్ (37 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించాడు. వాస్తవానికి బుధవారమే ఈ మ్యాచ్ పూర్తవ్వాల్సింది. కానీ ఆస్ట్రేలియా లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఆటను గురువారం కూడా కంటిన్యూ చేశారు. బుధవారం వర్షం అంతరాయం కలిగించే సమయానికి 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కాగా గురువారం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 3 ఓవర్లు ఆడింది. మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్ డక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో కామెరున్ వైట్ 30, బ్రాడ్ హడిన్ 12 పరుగులు చేశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 10 పరుగులు చేసిన టెండూల్కర్ రీయర్డన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా(11) కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్(18)తో కలిసి నమన్ ఓజా(62 బంతుల్లో 90 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. యువీ, బిన్నీ, యూసఫ్ పఠాన్లు వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇర్ఫాన్ పఠాన్( 12 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. నమన్ ఓజా చెలరేగాడు. 10 పరుగుల దూరంలో సెంచరీ దూరమైనప్పటికి నమన్ ఓజా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 19.2 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య సెమీఫైనల్-2 మ్యాచ్ విజేతతో ఇండియా లెజెండ్స్ ఫైనల్ ఆడనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. Naman Ojha and Irfan Pathan guided India Legends towards a comfortable win against Australia Legends 🇮🇳🙌🏻#rsws #indialegends pic.twitter.com/qXrgq5MFH6 — Sportskeeda (@Sportskeeda) September 29, 2022 చదవండి: సెంచరీతో చెలరేగిన విండీస్ హిట్టర్.. ఫైనల్లో జమైకా తలైవాస్ సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! -
వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్ మాత్రం తగ్గేదే లే
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు నిరాశపరుస్తోంది. ఇండియా మహరాజాస్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అయితే మ్యాచ్ ఓడినప్పటికి వసీం జాఫర్ తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నమన్ ఓజాతో కలిసి మంచి ఆరంభం ఇచ్చిన జాఫర్ 25 బంతుల్లో ఏడు బౌండరీలతో 35 పరుగులు సాధించాడు. చదవండి: Shafali Verma: చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలిసారి టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో తక్కువే ఆడినప్పటికి.. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రం జాఫర్ తనదైన ముద్ర వేశాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో పాత జాఫర్‌ను గుర్తు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాఫర్ క్రీజులో ఉన్నంతసేపు విజయం మనదేనని భావించినప్పటికి.. ఆ తర్వాత భారత్ ఆట పూర్తిగా నీరుగారిపోయింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. తరంగ 72, అస్గర్ అఫ్గన్ 69 నాటౌట్ రాణించారు. ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
ఇమ్రాన్ తాహిర్ విధ్వంసం.. 5 సిక్స్‌లు,3 ఫోర్లలతో..
లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ బ్యాట్‌తో విద్వంసం సృష్టించాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో వరల్డ్ జెయింట్స్‌కు తాహిర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి జెయింట్స్‌ను గెలిపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాజాస్ నమన్ ఓజా(140), కెప్టెన్ కైఫ్(53) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది. అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెయింట్స్ విజయంలో కెవిన్ పీటర్సన్(53), తాహిర్ (52) పరుగులుతో కీలక పాత్ర పోషించారు. చదవండి నమన్ ఓజా తుపాన్ ఇన్నింగ్స్.. 15 ఫోర్లు, 9 సిక్స్‌లు.. కేవలం 60 బంతుల్లో.. -
నమన్ ఓజా తుపాన్ ఇన్నింగ్స్.. 15 ఫోర్లు, 9 సిక్స్‌లు.. కేవలం 60 బంతుల్లో..
legends league cricket 2022: లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మహారాజాస్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి జెయింట్స్ ఛేదించింది. వరల్డ్ జెయింట్స్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒకనొక సమయంలో 130 పరుగులకే 6 వికెట్ల కోల్పోయిన జెయింట్స్‌కు ఓటమి తప్పదు అని అంతా భావించారు. కానీ తాహిర్ తన తుపాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అంతే కాకుండా మహారాజాస్ చెత్త ఫీల్డింగ్ కూడా ఓటమికు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాజాస్ ఆదిలోనే సుబ్రమణియన్ బద్రీనాథ్, వసీం జాఫర్ వికెట్లను కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ నమన్ ఓజా చేలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 69 బంతుల్లో 140 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. అతడికి తోడు కెప్టెన్ కైఫ్(53) బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది. చదవండి: సంచలనం సృష్టించిన రాజ్ బావా.. ధావన్ రికార్డు బ్రేక్ -
అన్ని ఫార్మాట్లకు భారత క్రికెటర్ గుడ్ బై
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో సీనియర్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా ఉన్న నమన్ ఓజా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ సోమవారం నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల ఓజా దేశం తరఫున మూడు ఫార్మాట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లు ఆడాడు. ‘ఇక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. సుదీర్ఘకాలం పాటు క్రికెటర్‌గా కొనసాగడం గర్వంగా ఉంది. దేశానికి, రాష్ట్రానికి ఆడడం నా కల దాన్ని పూర్తి చేశా ’ అని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఆయన వెన్నంటే ఉన్న వారు ఓదార్చారు. 2000లో క్రికెట్లోకి ప్రవేశించిన ఓజా 2021లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 17 ఏళ్ల వయసప్పుడు 2000-01లో ఓజా మధ్యప్రదేశ్ తరఫున క్రికెట్ రంగ ప్రవేశం చేశాడు. ఆ సమయంలోనే మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా జట్టులోకి రావడంతో ఓజాకు అవకాశాలు రాలేదు. ఐపీఎల్లో ఓజా ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. మధ్యప్రదేశ్ నుంచి నరేంద్ర హిర్వానీ తర్వాత టెస్టు క్రికెట్ ఆడిన రెండో ఆటగాడు ఓజానే. 2010లో జింబాబ్వే పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఓజా ఎంపికయ్యాడు. 2015లో శ్రీలంకతో కొలంబో వేదికగా టెస్టు మ్యాచ్ ఆడాడు. 20 సీజనల్లో దేశవాళీ క్రికెట్లో ఓజా నిలకడగా ఆడాడు. అయితే జాతీయ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. #Indian international cricket player Naman Ojha announced his retirement. He was worst in tears while announced his retirement from international cricket. pic.twitter.com/yciKLXBiEX — Govind Gurjar (@govindtimes) February 15, 2021 -
హడలెత్తించిన గిరినాథ్
ఇండోర్: యువ మీడియం పేసర్ పారెడ్డి గిరినాథ్ రెడ్డి హడలెత్తించడంతో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 10.5 ఓవర్లలో నాలుగు మెయిడిన్లు వేసి కేవలం 29 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన గిరినాథ్ రెడ్డి మధ్యప్రదేశ్ జట్టును 91 పరుగులకే కుప్పకూల్చ డంలో కీలకపాత్ర పోషించాడు. నమన్ ఓజా (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రజత్ పాటిదార్ (19; 3 ఫోర్లు), శుభం శర్మ (16; 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. విజయ్ కుమార్ రెండు వికెట్లు తీయగా... మనీశ్, శశికాంత్ ఒక్కోవికెట్ పడగొట్టారు. 41 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆంధ్ర ఓవరాల్ ఆధిక్యం 239 పరుగులకు చేరింది. ఓపెనర్లు ప్రశాంత్ (44; 5 ఫోర్లు), జ్ఞానేశ్వర్ (43; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. కరణ్ షిండే (45 బ్యాటింగ్; 8 ఫోర్లు), శశికాంత్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహా ఔట్
కొలంబో: శ్రీలంకతో జరగనున్న చివరిదైన మూడో టెస్టులో భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ఓపెనర్ మురళీ విజయ్, కీపర్ వృద్ధిమాన్ సాహాలు ఈ టెస్ట్ మ్యాచ్ ఆడటం లేదు. వీరికి బదులుగా భారత జట్టులోకి కరుణ్ నాయర్, నమన్ ఓజాలను తీసుకున్నారు. మూడో టెస్టులో వీరు మ్యాచ్ ఆడతారని బీసీసీఐ అధికారులు తెలిపారు. -
టెస్టు జట్టులోకి రైనా, ఓజా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా సిరీస్ కు 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. కర్ణాటక ఓపెనర్ లోకేష్ రాహుల్, లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మలను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ నమన్ ఓజా, సురేష్ రైనాలకు టీమ్ లో మళ్లీ చోటు కల్పించారు. ప్రకటించింది. శిఖర్ ధావన్, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు. వృద్ధిమాన్ సాహాకు ఉద్వాసన పలికారు. రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్పలను తీసుకున్నారు. గాయపడిన ఇషాంత్ శర్మ స్థానంలో వినయ్ కుమార్ కు అవకాశమిచ్చారు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరగనున్న మొదటి టెస్టులోభారత జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కావడంతో కోహ్లికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. -
నమన్ సెంచరీల హ్యాట్రిక్
వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో శతకం భారత్ ‘ఎ’కు ఆధిక్యం బ్రిస్బేన్: సెలక్టర్లను ఆకట్టుకునేందుకు అందివచ్చిన అవకాశాన్ని వికెట్ కీపర్ నమన్ ఓజా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’ పై వరుసగా మూడో సెంచరీని సాధించాడు. భారత్ ‘ఎ’కు ఆధిక్యాన్ని అందించాడు. నమన్ ఓజా బ్యాటింగ్ ప్రతిభతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్‌లోనూ భారత్ ‘ఎ’ భారీ స్కోరు కూడగట్టుకుంది. ఈ మ్యాచ్ కూడా ‘డ్రా’ దిశగా సాగుతోంది. మ్యాచ్ మూడో రోజు మంగళవారం భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 501 పరుగులకు ఆలౌటైంది. దీంతో 78 పరుగుల ఆధిక్యం లభించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న నమన్ ఓజా (134 బంతుల్లో 110; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) ఈ సిరీస్‌లో వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో శతకం సాధించడం విశేషం. మరోవైపు ఉమేశ్ యాదవ్ (66 బంతుల్లో 90; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) తృటిలో సెంచరీని కోల్పోయాడు. అనంతరం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బంతిని ఎదుర్కోగానే వెలుతురులేమితో మ్యాచ్‌ను నిలిపేశారు. -
రాయుడు, ఓజా అజేయ సెంచరీలు
ఆసీస్ ‘ఎ’తో భారత్ ‘ఎ’ తొలి టెస్టు డ్రా బ్రిస్బేన్: నమన్ ఓజా (127 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు), అంబటి రాయుడు (165 బంతుల్లో 100 నాటౌట్; 17 ఫోర్లు, 1 సిక్స్)లు అజేయ సెంచరీలతో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత్ ‘ఎ’ తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. బుధవారం చివరిరోజు భారత్ ‘ఎ’ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో సేయర్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 522/9తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ ‘ఎ’ మరో 12 పరుగులు మాత్రమే జోడించి 534 పరుగుల వద్ద ఆలౌటైంది. సంక్షిప్త స్కోర్లు: భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 475/9 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 534 ఆలౌట్; భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 285/5 (నమన్ ఓజా 101 నాటౌట్, రాయుడు 100 నాటౌట్; సేయర్స్ 3/48) -
నమన్ ఓజా డబుల్ సెంచరీ
భారత్ ‘ఎ' 475/9 డిక్లేర్డ్ ఆస్ట్రేలియా ‘ఎ' 126/6 బ్రిస్బేన్: నమన్ ఓజా (250 బంతుల్లో 219 నాటౌట్; 29 ఫోర్లు, 8 సిక్సర్లు) ద్విశతకంతో చెలరేగడంతో పాటు బౌలర్లు నిలకడగా రాణించడంతో... ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ' పట్టు బిగించింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం భారత్ ‘ఎ' తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. ఫిల్ హ్యూస్ (34)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 42 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసీస్ మరో 349 పరుగులు వెనుకబడి ఉంది. ఓజా దూకుడు... ఓవర్‌నైట్ స్కోరు 304/6తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్‌ను ఓజా నడిపించాడు. సోమవారం భారత్ స్కోరుకు మరో 171 పరుగులు చేరితే... అందులో ఓజా ఒక్కడే 137 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ ఆసాంతం భారీ షాట్లు ఆడిన ఈ మధ్యప్రదేశ్ క్రికెటర్ సెంచరీ, డబుల్ సెంచరీలను సిక్సర్లతోనే పూర్తి చేసుకోవడం విశేషం. -
మూడో స్థానమే ఇష్టం: నమన్ ఓజా
హైదరాబాద్: మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయడం తనకిష్టమని హైదరాబాద్ సన్‌రైజర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నమన్ ఓజా పేర్కొన్నాడు. ఈ స్థానంలో కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పాడు. మంచి భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఇది సరైన స్థానమని అభిప్రాయపడ్డాడు. ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగితే మొదటి బంతి నుంచి బాదడం కష్టమవుతుందన్నాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగితే ఇన్నింగ్స్ నిర్మించేందుకు సమయం దొరుకుతుందని వివరించాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓజా అర్థసెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు.