టెస్టు జట్టులోకి రైనా, ఓజా | Suresh Raina, Naman Ojha staged a comeback into the Test fold | Sakshi
Sakshi News home page

టెస్టు జట్టులోకి రైనా, ఓజా

Published Mon, Nov 10 2014 4:01 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

టెస్టు జట్టులోకి రైనా, ఓజా

టెస్టు జట్టులోకి రైనా, ఓజా

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా సిరీస్ కు 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. కర్ణాటక ఓపెనర్ లోకేష్ రాహుల్, లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మలను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. వికెట్ కీపర్- బ్యాట్స్మన్ నమన్ ఓజా, సురేష్ రైనాలకు టీమ్ లో మళ్లీ చోటు కల్పించారు.

ప్రకటించింది. శిఖర్ ధావన్, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు. వృద్ధిమాన్ సాహాకు ఉద్వాసన పలికారు. రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్పలను తీసుకున్నారు. గాయపడిన ఇషాంత్ శర్మ స్థానంలో వినయ్ కుమార్ కు అవకాశమిచ్చారు.

ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరగనున్న మొదటి టెస్టులోభారత జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కావడంతో కోహ్లికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement