Team India Test Team
-
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ... బీసీసీఐ అధికారిక ప్రకటన
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమిస్తూ బీసీసీఐ శనివారం ప్రకటన చేసింది. ఇకపై పూర్తి స్ధాయిలో రోహిత్ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్ట్, టీ20 సిరీస్‌లకు జట్టులను బీసీసీఐ ఎంపిక చేసింది. స్వదేశంలో శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంకతో టెస్టులకు కెప్టెన్‌గా రోహిత్ ఎంపిక కాగా, వైస్ కెప్టెన్‌గా బూమ్రా నియమితుడయ్యాడు. ఇక దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారని అంతా ఆతృతగా ఎదురు చుశారు. బీసీసీఐ ప్రకటనతో వారి నిరీక్షణకు తెరపడింది. కాగా ఇకపై రోహిత్ భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ వ్యవహరించనున్నాడు. గత ఏడాది టీ20, వన్డేల్లో భారత కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ చెపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: BPL 2022 Final: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్ -
టెస్టు జట్టులోకి రైనా, ఓజా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా సిరీస్ కు 19 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది. కర్ణాటక ఓపెనర్ లోకేష్ రాహుల్, లెగ్ స్పిన్నర్ కరణ్ శర్మలను కొత్తగా జట్టులోకి తీసుకున్నారు. వికెట్ కీపర్- బ్యాట్స్‌మన్ నమన్ ఓజా, సురేష్ రైనాలకు టీమ్ లో మళ్లీ చోటు కల్పించారు. ప్రకటించింది. శిఖర్ ధావన్, అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు. వృద్ధిమాన్ సాహాకు ఉద్వాసన పలికారు. రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్పలను తీసుకున్నారు. గాయపడిన ఇషాంత్ శర్మ స్థానంలో వినయ్ కుమార్ కు అవకాశమిచ్చారు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరగనున్న మొదటి టెస్టులోభారత జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గాయం కారణంగా తొలి టెస్టుకు దూరం కావడంతో కోహ్లికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. -
మెకల్లమ్ ద్విశతకం; కివీస్‌కు భారీ ఆధిక్యం
వెల్లింగ్టన్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టుబిగిచింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ డబుల్ సెంచరీ, వాట్లింగ్ సెంచరీలతో చెలరేగడంతో కివీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 252/5 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ఆరంభించిన కివీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 571/6 స్కోరు చేసింది. దీంతో న్యూజిలాండ్‌కు 325 పరుగుల ఆధిక్యం లభించింది. మెకల్లమ్, వాట్లింగ్ ఆరో వికెట్‌కు 355 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ కోలుకుంది. వాట్లింగ్(124)ను మహ్మద్ షమీ అవుట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత మరో వికెట్ పడకుండా కివీస్ జాగ్రత్త పడింది. మెకల్లమ్ ట్రిఫుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. అయితే ట్రిఫుల్ సెంచరీ చేసే వరకు ఆగుతాడా లేక మ్యాచ్ ను ముందే డిక్లేర్ చేస్తాడా అనేది మంగళవారం తేలుతుంది. మెకల్లమ్ 281, నిషామ్ 67 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. చివరి రోజు ఏదైనా సంచలనం జరిగితే తప్పా మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 192, భారత్ 438 పరుగులు చేశాయి. -
టెస్టు జట్టులో అంబటి రాయుడికి చోటు
-
టెస్టు జట్టులో అంబటి రాయుడికి చోటు
వడొదర: దక్షిణాఫ్రికాకు పర్యటనకు భారత జట్టును సెలక్షన్ కమిటీ నేడు ప్రకటించింది. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు తొలిసారిగా టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. రిజర్వు బ్యాట్స్‌మన్‌గా అతడికి ఎంపిక చేశారు. జూలైలో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రాయుడు ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం సంపాదించాడు. 2001లోనే తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతనికి 27 ఏళ్ల 10 నెలల వయసులో భారత్ తరఫున మొదటి అవకాశం దక్కింది. టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కు మరోసారి నిరాశ ఎదురయింది. పేసర్ జహీర్ ఖాన్‌కు మళ్లీ పిలుపు వచ్చింది. ధోనీ సేన వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. టెస్టు టీమ్ మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్య రహానే, అంబటి రాయుడు, వృద్ధిమాన్ సాహా, జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అశ్విన్, రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజా.