
టెస్టు జట్టులో అంబటి రాయుడికి చోటు
వడొదర: దక్షిణాఫ్రికాకు పర్యటనకు భారత జట్టును సెలక్షన్ కమిటీ నేడు ప్రకటించింది. తెలుగు ఆటగాడు అంబటి రాయుడు తొలిసారిగా టెస్టు టీమ్లో చోటు దక్కించుకున్నాడు. రిజర్వు బ్యాట్స్మన్గా అతడికి ఎంపిక చేశారు. జూలైలో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రాయుడు ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం సంపాదించాడు. 2001లోనే తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన అతనికి 27 ఏళ్ల 10 నెలల వయసులో భారత్ తరఫున మొదటి అవకాశం దక్కింది.
టెస్టు జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న ఓపెనర్ గౌతమ్ గంభీర్కు మరోసారి నిరాశ ఎదురయింది. పేసర్ జహీర్ ఖాన్కు మళ్లీ పిలుపు వచ్చింది. ధోనీ సేన వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
టెస్టు టీమ్
మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, అజింక్య రహానే, అంబటి రాయుడు, వృద్ధిమాన్ సాహా, జహీర్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అశ్విన్, రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజా.