
భారత్- పాక్ మ్యాచ్ అంటే చాలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా టీవీలకు అతుక్కుపోవాల్సిందే. ప్రతి బాల్‌కు నరాలు తెగే ఉత్కంఠగా ఉంటుంది. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. అంతలా క్రేజ్ ఉన్న మ్యాచ్ ప్రపంచ క్రికెట్‌లో పాక్- ఇండియా పోరు మాత్రమే. ఇలాంటి మ్యాచ్‌ను లైవ్‌లో చూడాలని ఎవరూ కోరుకోరు. ఆ అదృష్టం రావాలే కానీ ఎంతైనా సరే టికెట్ కొని మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి మ్యాచ్‌కు మన టాలీవుడ్ సినీతారలు పెద్దఎత్తున హాజరయ్యారు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌కు హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నారు.
అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరాలు మన సినీ తారలను హైలెట్ చేస్తూ టీవీల్లో చూపించారు. మన డైరెక్టర్ సుకుమార్‌ను సైతం కెమెరాల్లో చాలాసేపు చూపించారు. తెలుగు సినిమా ప్రైడ్ డైరెక్టర్ సుకుమార్ అని కామెంట్రీ చెబుతున్న వ్యక్తి అన్నాడు. ఇలాంటి మ్యాచ్‌లు సప్లై తక్కువ.. డిమాండ్ ఎక్కువ అని వ్యాఖ్యనించాడు.
కానీ ఇదే సమయంలో అక్కడే తెలుగు కామెంట్రీ బాక్స్‌లో ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మాత్రం వివాదాస్పద రీతిలో మాట్లాడారు. సప్లై కాదు.. ఇలాంటి మ్యాచ్ అంటే టీవీల్లో ఎక్కువగా కనిపిస్తారు కదా.. ఇతర మ్యాచ్‌ల్లో కనిపించడం చాలా తక్కువ.. పబ్లిసిటీ స్టంట్ అది..' అంటూ అంబటి రాయుడు మాట్లాడారు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అంబటి రాయుడిపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడిపై మండిపడుతున్నారు. మన తెలుగు సినిమా గొప్ప దర్శకుడిని అలా ఎలా అంటారని అంబటిని ప్రశ్నిస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్ అంటూ హేళన చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
Chiranjeevi , Sukumar cricket match ki vellatam oka Publicity Stunt
:- Ambati Rayudu @KChiruTweets @SukumarWritings pic.twitter.com/ztbCgHBJES— Songs Lover (@Songs_Lover_) February 23, 2025
Comments
Please login to add a commentAdd a comment