మూడో స్థానమే ఇష్టం: నమన్ ఓజా | I would love to continue batting at No.3: Naman Ojha | Sakshi
Sakshi News home page

మూడో స్థానమే ఇష్టం: నమన్ ఓజా

Published Thu, May 15 2014 12:04 PM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

మూడో స్థానమే ఇష్టం: నమన్ ఓజా

మూడో స్థానమే ఇష్టం: నమన్ ఓజా

హైదరాబాద్: మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేయడం తనకిష్టమని హైదరాబాద్ సన్రైజర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ నమన్ ఓజా పేర్కొన్నాడు. ఈ స్థానంలో కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పాడు. మంచి భాగస్వామ్యం నెలకొల్పేందుకు ఇది సరైన స్థానమని అభిప్రాయపడ్డాడు.

ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్కు దిగితే మొదటి  బంతి నుంచి బాదడం కష్టమవుతుందన్నాడు. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగితే ఇన్నింగ్స్ నిర్మించేందుకు సమయం దొరుకుతుందని వివరించాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్తో బుధవారం హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ఓజా అర్థసెంచరీతో రాణించాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement